Thursday, November 14, 2024

బిజెపి రక్తం తాగే పులిలాంటిది: ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

BJP is like blood-sucking tiger: MLA Jaggareddy

 

మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి రక్తం తాగే పులిలాంటి స్వభావం గలదని సంగారెడ్డి కాంగ్రెస్ ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి అన్నారు. పైకి గోవులా కనపడుతూనే హిందువులను రెచ్చగొడుతుందని చెప్పారు. మీకు మతాల మధ్య గొడవలు కావాలా? లేక ప్రజలకు మేలు జరగడం కావాలా? అని ప్రశ్నించారు. బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌కు జగ్గారెడ్డి సవాల్ విసిరారు. బండి సంజయ్ కుమార్ హిందూత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హిందువుల కోసం తాను లేవనెత్తే నాలుగు ప్రశ్నలకు చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న 80 శాతం మంది హిందువుల కోసం పనిచేస్తానని చెప్పావ్.. హిందువుల కోసం మోడీతో మాట్లాడి పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించగలవా? తెలంగాణలోని పేద హిందువులకు రూ.15 లక్షలు ఇప్పించగలవా? నిజాం భూములు తీసుకుని హిందువులకు ఇస్తామని చెప్పగెలవా? 80 శాతం మంది హిందువుల కోసం మాట మీద నిలబడగలవా? అని జగ్గారెడ్డి సవాల్ విసిరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News