Saturday, November 23, 2024

ఎపిలో ఐదుగురు ఐఎఎస్‌లకు జైలు శిక్ష, జరిమానా

- Advertisement -
- Advertisement -

Five IAS officers jailed in Andhra Pradesh

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు ఐఏఎస్‌లకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ గురువారం నాడు ఎపి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎపిలోని నెల్లూరు జిల్లా తాళ్లపాక సాయి బ్రహ్మ భూ వ్యవహారంలో ఓ మహిళ నుంచి భూమి తీసుకుని పరిహారం ఇవ్వకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశించినా చెల్లింపుల్లో జాప్యం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం ఐఎఎస్‌ల జీతాల నుంచి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్‌కు జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించింది. అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరిబాబుకు, ఇప్పటి ఐఎఎస్ ముత్యాలరాజుకు వెయ్యి రూపాయల జరిమానా, 2 వారాల జైలుశిక్ష ఖరారు చేసింది.మరో ఐఎఎస్ రావత్‌కు నెల రోజుల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించింది. శిక్షపై అప్పీల్ చేసుకునేందుకు నెల రోజులు గడువిచ్చిన హైకోర్టు నెల రోజుల పాటు శిక్షను సస్పెండ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News