Tuesday, November 5, 2024

కొత్త వేరియంట్ సి 1.2 దేశంలో ప్రవేశించలేదు: కేంద్రం

- Advertisement -
- Advertisement -

No cases of new Covid variant C.1.2 detected in India

న్యూఢిల్లీ : ఇప్పటివరకు దేశంలో సి 1.2 వేరియంట్‌కు సంబంధించి ఎలాంటి కేసులు నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్‌ను మొట్టమొదటిసారి దక్షిణాఫ్రికాలో గుర్తించారు. ప్రస్తుతం ఇది చైనా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ సహా ఆరు దేశాలకు వ్యాపించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇప్పటివరకు ఉన్న వేరియంట్లు అన్నిటికన్నా ఇది ఎంతో ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీకాల ద్వారా లభించిన రక్షణను కూడా ఇది తప్పించుకోగలదని నిపుణులు హెచ్చరించారు. అయితే ప్రస్తుతానికి భారత్‌లో ఈ వేరియంట్ ప్రవేశించలేదని కేంద్రం స్పష్టం చేయడం కొంత ఊరట కలిగిస్తోంది.

No cases of new Covid variant C.1.2 detected in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News