కేంద్రానికి చిదంబరం డిమాండ్
ముంబై : జాతీయ ఆస్తుల అమ్మకాలు నేషనల్ మానిటైజేషన్ ఉద్ధేశాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజలముందుంచాలని మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కేంద్రం ఇటీవలనే నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్‌ఎంపి)ని ప్రకటించింది. అయితే దీని స్వరూపం ఏమిటనేది స్పష్టం చేయలేదు. ఇది కేవలం నాలుగేళ్ల కాలానికి ఆదాయ వనరులను సమకూర్చుకోవడానికేనా? లేక ఇతరత్రా ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? అని నిలదీశారు. సంబంధిత విషయంపై చిదంబరం మోడీ ప్రభుత్వానికి 20 ప్రశ్నలు సంధించారు. ఎన్‌ఎంపిపై కాంగ్రెస్ పార్టీకి పలు సందేహాలు ఉన్నాయి, అభ్యంతరాలు ఉన్నాయి.
గుర్తించిన ఆస్తుల వేలం విక్రయాలతో ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లలో రూ ఆరు లక్షలకు పైగా ఆదాయం గడించాలని అనుకొంటోందా? ఇందుకు ఈ ప్రతిపాదన తెచ్చిందా? తేలియచేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ ప్రజా ఆస్తులతో ఏటా నిర్థిష్టంగా రెవెన్యూదక్కుతోంది. మరి వీటిని తెగనమ్మడం వివేకం అన్పించుకుంటుందా? అని చిదంబరం ప్రశ్నించారు. అమ్మకాలతో వచ్చే ఆరు లక్షల కోట్ల ఆదాయం, ఇప్పుడు ప్రభుత్వం దాచిపెట్టి ఉంచిన ఏడాదికి వచ్చే ఆదాయ వివరాలతో పోల్చిచూసుకుంటే , తేడా ఏమిటనేది తేలుతుందని తెలిపారు. సందేహాలను తీర్చేలా ప్రజలకు దీనిపై పూర్తి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చిదంబరం స్పష్టం చేశారు.
Centre selling govt assets in name of monetisation policy