Saturday, November 23, 2024

తార్నాక ఆసుపత్రిలో మరింత మెరుగైన వైద్యం: సజ్జనార్ భరోసా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఉద్యోగులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంస్థ మనుగడ బాగుంటుందని, ఈ మేరకు ఆర్టీసి ఆసుపత్రులలో మరింత మెరుగైన వైద్యం అందించడానికి తగిన చర్యలు తీసుకోనున్నట్లు టిఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ఉద్యోగులకు భరోసా కల్పించారు. శనివారం టిఎస్‌ఆర్టీసి తార్నాక ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంస్థలోని అన్ని రీజియన్లలో రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా, తార్నాక ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రెండో డోసు వ్యాక్సిన్ శిబిరాన్ని పరిశీలించారు. 48 వేల మంది ఉద్యోగుల్లో 28 వేల మంది సిబ్బందికి రెండు డోసులు అయిపోయాయని మిగిలిన 20 వేల మందికి రెండో డోసు ఇచ్చేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టిన విషయాన్ని అధికారులు ఎండికి వివరించగా అక్కడి శిబిరాన్ని పరిశీలిస్తూ సిబ్బందికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఒ.పి, ఎక్సరే, ఫార్మసీ, స్కానింగ్, బ్లడ్ శాంపిల్ రూం, ల్యాబ్ సెంటర్, ఇ.సి.జి విభాగాలను పరిశీలిస్తూ పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలను గమనించారు. ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ వార్డులను గమనించి కొన్ని మార్పులు చేసేందుకై ఆదేశించారు. అనంతరం ఎండి డాక్టర్లతో సమావేశం అయ్యారు.

రోగుల క్షేమం కోసం యుద్ధ ప్రాతిపదికన మరో రెండు అంబులెన్స్‌లను సమకూర్చడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. సంస్థ సిబ్బంది, ఉద్యోగులకు ప్రత్యేకంగా, వృత్తిపరంగా ఎదురయ్యే సమస్యల విషయంలో అవసరమైనన మేర వైద్య సేవల్ని అందించాలని డాక్టర్లకు సూచించారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. సంస్థ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్య క్షేమంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు. ప్రతి విభా౪గంలోని స్పెషలిస్ట్ డాక్టర్లకు సంబంధించిన వైద్య పరికరాలు, సదుపాయాలపై కూడా చర్చించారు. ఈ మేరకు సమస్యల్ని పరిష్కరించడం జరుగుతుందంటూ ఉద్యోగులకు అత్యంత ఆధునికమైన వైద్య సదుపాయం కల్పించాల్సి ఉందన్నారు. వైద్య పరీక్షల కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఎక్కువ పరీక్షలు నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. రిఫరెల్ ఆసుపత్రులు, బయటి వైద్య పరీక్షా కేంద్రాలకి సంస్థ ఉద్యోగులను పంపకుండా కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో అన్ని సదుపాయాలను కల్పించడానికి తగిన ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆసుపత్రిలో మొక్కలను నాటిన ఎండి
నూతనంగా బాధ్యతలు చేపట్టి ఉద్యోగుల ఆరోగ్య క్షేమం కాంక్షించి మొట్టమొదటగా ఆసుపత్రిని సందర్శించిన ఎండి సజ్జనార్ తార్నాక ఆసుపత్రిలో మొక్కలు నాటారు. రోగులకు ప్రాథమికంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఎంతో ముఖ్యమంటూ ఆసుపత్రిలో నెలువై ఉన్న గ్రీసరీని పరిశీలించి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇడి (రెవెన్యూ, ఐటి), సంస్థ కార్యదర్శి పురుషోత్తం, ఇడి(ఓఅండ్ఎ) యాదగిరి, ఇడి(ఇ) వినోద్, ఇడి(జి.హెచ్.జడ్) వెంకటేశ్వర్లు, ఇడి(హెచ్అండ్ కె) మునిశేఖర్, తార్నాక ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకట రమణ తదితర డాక్టర్లు పాల్గొన్నారు.

RTC MD Sajjanar Inspection at Tarnaka Hospital

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News