కాంగ్రెస్కు 598, బిజెపికి 490 స్థానాలు
జైపూర్: రాజస్థాన్లోని ఆరు జిల్లాలలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యతను ప్రదర్శించింది. అధికార కాంగ్రెస్ 598 పంచాయత్ సమితి సీట్లను గెలుచుకోగా ప్రతిపక్ష బిజెపి 490 సీట్లను గెలుచుకుంది. మూడు విడతలలో ఆరు జిల్లాలలోని 1564 పంచాయత్ సమితి స్థానాలకు ఎన్నికలు జరుగగా శనివారం సాయంత్రం వరకు 1389 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ 598 స్థానాలు, బిజెఎపి 490, ఆర్ఎల్పి 39, బిఎస్పి 10, ఎన్సిపి 2 స్థానాలను గెలుచుకున్నాయి. 250 స్థానాలలో ఇండిపెండెంట్లు విజయం సాధించారు. కాగా, 200 జిల్లా పరిషద్ స్థానాలకు గాను ఇప్పటి వరకు ఒక స్థానం ఫలితం ప్రకటించగా అది కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. భరత్పూర్, దౌసా, జైపూర్, జోధ్పూర్, సవాయ్ మాధోపూర్, సిరోహి జిల్లాల్లోని ఆరు జిల్లా పరిషద్లకు చెందిన 200 మంది సభ్యులు, 78 పంచాయత్ సమితిలకు చెందిన 1564 మంది సభ్యులను ఎన్నుకోవడానికి ఆగస్టు 26, 29, సెప్టెంబర్ 1న మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి.