శ్రీనగర్ : వేర్పాటువాద నేత , హురియత్ నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ భౌతికకాయంపై పాకిస్థాన్ జెండాను ఉంచడం వివాదాస్పదం అయింది. భౌతిక కాయాన్ని పాకిస్థాన్ జాతీయ జెండాలో ఉంచి గురువారం ఖననవాటికకు తరలించారు. ముందుగానే దీనిని పసికట్టి జెండాను జమ్మూ కశ్మీర్ పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. జెండా అంశంపై స్థానిక పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన ఉగ్రవాద నిరోధక చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం (యుఎపిఎ) పరిధిలో కేసులు దాఖలు చేశారు. వయోవృద్ధ నేత మరణం తరువాత కశ్మీర్ లోయలో భద్రతా ఆంక్షలు కట్టుదిట్టం చేశారు. ఫోన్లు, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. 92 సంవత్సరాల గిలానీ జీవితాంతం పాకిస్థాన్ అనుకూల , విడి కశ్మీర్ ఏర్పాటు ఉద్యమకర్తగా నిలిచారు. అతివాద వేర్పాటువాద నేత అయిన గిలానీ అంతిమ ఘట్టం హడావిడి లేకుండా పోలీసుల తీవ్రస్థాయి నిఘా నడుమ జరిగింది. పోలీసు బృందాలు వచ్చి ఆయన భౌతికకాయాన్ని బలవంతంగా తీసుకువెళ్లాయని , తమను కూడా అంత్యక్రియల స్థలానికి అనుమతించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
గిలానీ భౌతికకాయంపై పాక్ జెండా రగడ
- Advertisement -
- Advertisement -
- Advertisement -