నెలకొల్పడానికి ఆలోచిస్తున్నామని మంత్రి కెటిఆర్ వెల్లడి
కేన్సర్ రోగులు చివరి రోజుల్లో ఆనందంగా గడపడానికి ప్రభుత్వం అండ
హైదరాబాద్‌లోని ఖాజాగూడలో 82 పడకల స్పర్శ్ హాస్పిస్‌ను ప్రారంభించిన మంత్రి
స్పర్శ్ హాస్పిస్‌ను నెలకొల్పిన రోటరీ సంస్థను అభినందించిన కెటిఆర్
మన తెలంగాణ/గచ్చిబౌలి : క్యాన్సర్ రోగులను తుది దశలో ఆనందంగా గడపడం కోసం స్పాపాలిటీవ్ కేర్ అందిస్తున్నా ప్రోత్సాహం అభినందనీయమని, ప్రైవేట్ భాగస్వామ్యంతో పాలిటివ్ కేర్ లో ప్రవేశించడానికి తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజగూడాలో 82 పడకల స్పర్ష్ హస్పిస్ పాలిటివ్ కేర్ ను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అందించిన 1.1 ఎకరాల భూమిలో సుమారు 15 కోట్లు దాతల ఆర్థిక సహాయంతో క్యాన్యర్ రోగుల కొరకు స్పార్ష్ హస్పిస్ ను ఏర్పాటు చేయడం అభినంనీయమని అన్నారు. 2014 సంవత్సరంలో మొదటి సారి స్పార్ష్ హస్పిస్ ను సందర్శించినప్పుడు పాలిటివ్ కేర్ అంటే ఎంటో తెలిదని, తర్వాత దాని గురించి తెలుసుకోవడం ప్రభుత్వం కూడా పాలిటివ్ కేర్ లోకి ప్రవేశించి ప్రజలకు సేవ చేసేందుకు ఆలోచిస్తుందని అన్నారు.
రాజకీయ నాయకులుగా ఎన్నో కార్యక్రమాలకు వేళ్లిన స్పార్ష్ హస్పిస్ సందర్శన తనకు ఒక ప్రత్యేక ముద్ర వేసిందని, ఏ సహాయానికి ఆయిన నిరంతరం అందుబాటులో ఉంటానని ఆయన పేర్కొన్నారు. మనిషి చివరి రోజుల్లో అనందంగా గడపడం కోసం స్పార్ష్ హస్పిస్ అందిస్తున్న ప్రోత్సాహాన్ని ఆయన ప్రశంసించాడు. భారతదేశంలోనే ఇది అతిపెద్ద పాలిటీవ్ కేర్ అని, అత్యంత ఆల్ట్రా మోడ్రన్ తో ఈ పాలిటివ్ కేర్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య సంస్థలో ఎన్నో మార్పులు చేపట్టిందని, కరోనా సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నూతనంగా హాస్పిటల్స్ ను ఏర్పాటు చేసి ఉచింతంగా వైద్యాన్ని అందిచడం జరిగిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం ప్రజల క్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. పుట్టుక చావుకు మధ్యలో మనిషి కష్ట సుఖాలతో బతికిన చాలు తుది దశ లో ఆనందంగా గడపడం కోసం రోటరీ సంస్థ ఈ పాలిటివ్ కేర్ ను స్థాపించి కాన్యర్ రోగుల బాధను కాస్తైన తగ్గించే ప్రయత్నం చేయడం అభినందనీయమని, ప్రభుత్వం కూడా ప్రైవేట్ భాగస్వాములతో ఇలాంటి పాలిటివ్ కేర్ స్థాపించే విధంగా ఆలోచన చేస్తామని ఆయన అన్నారు.
ఆరోగ్య శ్రీ లోకి పాలిటీవ్ కేర్ ను ప్రవేశపెట్టాలని సంస్థ నిర్వాహకులు కోరటం జరిగిందని, త్వరలోనే దాని పై నిర్ణయం తీసుకుంటామని, అదేవిధంగా ఈ స్పార్ష్ హస్పిస్ పాలిటీవ్ కేర్ ప్రభుత్వం నుండి నీరు, విద్యుత్ , ఇతర మున్సిపల్ బిల్లులు ఉండవని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం స్పార్ష్ హస్పిస్ సీఈఓ రామ్మోహన్ రావు మాట్లాడుతూ క్యాన్సర్, చిత్తవైకల్యం, పార్కిన్సన్స్ వ్యాధి ఉన్నా రోగులకు బాధ లేకుండా తుదిశ్వాస విడిచేందుకు ఈ పాలిటీవ్ కేర్ సహాయపడుతుందని అన్నారు. వ్యాధితో బాధపడుతున్నా రోగి జీవితం త్వరగా ముగుస్తుందని, వారి వ్యాధిని చికిత్సద్వారా నివారణ చేయడం సాధ్యం కాదు కాబట్టి వారి బాధను తగ్గించడమే ఈ సంస్థ యొక్క ఉద్ధేశం అని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో పాలిటీవ్ కేర్ లోని నర్సులకు 3 నుండి 6 నెలల శిక్షణను అందించాలని ఆలోచన చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోటకీ క్లబ్ బంజారహిల్స్ ప్రెసిడెంట్ వికాస్ రాంకా, ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ ఎం.సుబ్రమణ్యం, సురేష్ రెడ్డి, జగదీష్ రామడుగు, డీజిపి మహేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఎస్‌ఈఎస్‌ఈ కార్యదర్శి శ్రీకృష్ణ ఏదుల, రోటరీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ మహేష్ కోట్‌బాగ్, దాతలు వరప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.