2020 ఆగస్టులో జరిగిన లోడిరగ్‌తో పోలిస్తే 2021 ఆగస్టులో 51% అధికం
సిమెంట్ లోడిరగ్‌లో గత సంవత్సరాలోని ఏ ఆగస్టు నెలతో పోల్చినా 2021 ఆగస్టులో మెరుగైన ఫలితాలు నమోదు
హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే యంత్రాంగం సరుకు రవాణా లోడిరగ్ మెరుగుదలకు నిరంతం కృషి చేస్తున్న ఫలితంగా జోన్ సరుకు రవాణాలో పురోగాభివృద్ధి దిశగా కొనసాగుతుంది. దక్షిణ మధ్య రైల్వేలో సరుకు రవాణాకు సంబంధించి గత సంవత్సరంలో ఇదే సమయంతో పోలిస్తే ప్రస్తుత ఆగస్టు నెలలో అధికంగా లోడిరగ్ జరిగింది. ఆగస్టు 2021 నెలలో దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో మొత్తం మీద 9.5 మిలియన్ టన్నుల లోడిరగ్ అయ్యింది. ఇది 2020 ఆగస్టులో జరిగిన 6.3 మిలియన్ టన్నుల లోడిరగ్‌తో పోలిస్తే 51% అధికంగా ఉంది.
గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే 2021 ఆగస్టు నెలలో అన్ని రకాల సరుకులు అధికంగా లోడిరగ్ కావడంతో ప్రస్తుత సరుకు రవాణా లోడిరగ్ గణనీయంగా పుంజుకుంది. సిమెంట్ రంగానికి సంబంధించి రైల్వే వారిచే ఎప్పటికప్పుడు చేపట్టిన వివిధ వినూత్న విధానాలతో, జోన్‌లోని బిడియు బృందాల కృషితో 2021 ఆగస్టులో సిమెంట్ 2.93 మిలియన్ టన్నుల లోడిరగ్ జరిగింది. ఇది 2020 ఆగస్టులో జరిగిన 1.59 మిలియన్ టన్నుల లోడిరగ్‌తో పోలిస్తే 84% అధికమని అధికారులు తెలిపారు. సిమెంట్ లోడిరగ్‌లో ఇంతకుముందు సంవత్సరాలలోని ఏ ఆగస్టు నెలతో పోల్చినా, ప్రస్తుత 2021 ఆగస్టు నెలలో జరిగిన సిమెంట్ లోడిరగ్‌లో మెరుగైన ఫలితాలు నమోదయ్యాయి.
ఇదేతరహా అభివృద్ధి ఇతర సరుకుల లోడిరగ్‌లో కూడా కనిపించింది. బొగ్గు లోడిరగ్‌లో 72% (2021 ఆగస్టులో 4.23 మిలియన్ టన్నులు, 2020 ఆగస్టులో 2.46 మిలియన్ టన్నులు), కంటైనర్ లోడిరగ్‌లో 96% (2021 ఆగస్టులో 0.188 మిలియన్ టన్నులు, 2020 ఆగస్టులో 0.096 మిలియన్ టన్నులు) అభివృద్ధిని నమోదు చేసింది. అంతేకాక, సరుకు రవాణా లోడిరగ్ అభివృద్ధి కోసం సరుకు రవాణా రైళ్లు స్థిరంగా గంటకు 50 కిలో మీటర్ల సగటు వేగంతో నడిచాయని, వ్యాగన్ల వ్యవస్థను మెరుగుపరిచి రోజుకు 4700కుపైగా వ్యాగన్లు ఉభయులకు ప్రయోజనకరంగా ఉందిన రైల్వే వర్గాలు వెల్లడించాయి.