Friday, November 22, 2024

600 మంది తాలిబన్ల వధ!

- Advertisement -
- Advertisement -
600 Taliban killed in Afghanistan's Panjshir
పంజ్‌షీర్ లోయలోకి చొచ్చుకొని వెళ్లిన తాలిబన్లందరినీ మట్టుబెట్టిన ప్రతిఘటన దళాలు
1000 మంది లొంగుబాటు
ధ్రువపరిచిన రష్యా వార్త సంస్థ స్ఫుతిక్
పంజ్‌షీర్ లోయను కాపాడాలని ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి
తాలిబన్లకు లొంగిపోయే ప్రసక్తే లేదు
ఆ పరిస్థితులు వస్తే నన్ను కాల్చి చంపండి
ప్రతిఘటన దళాల నాయకుడు అమ్రుల్లా

కాబూల్ : అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లకు చావుదెబ్బ తగిలింది. ఈశాన్య ప్రాంతంలోని దుర్భేధ్యపు పంజ్‌షీర్‌లోయ ప్రాంతంలో 600 మందికి పైగా తాలిబన్లను అక్కడి ప్రతిఘటన దళాలు మట్టుపెట్టాయి. ఈ విషయాన్ని స్ఫుత్నిక్ వార్తాసంస్థ ఆదివారం తెలిపింది. ఓ వైపు దేశంలో సమగ్రరీతిలో సరికొత్త సర్కారు ఏర్పాటుకు తాలిబన్లు సకలశక్తులు కూడదీసుకుంటున్న దశలోనే ఈ పిడుగుపాటు మించిన పరిణామం చోటుచేసుకుంది. అఫ్ఘన్ ప్రతిఘటన దళాల నుంచి తమకు అందిన సమాచారాన్ని ప్రాతిపదికగా చేసుకుని ఈ రష్యా వార్తాసంస్థ ఈ ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చింది. తాలిబన్ల అధికారాన్ని పంజ్‌షీర్‌లోని శక్తులు సంఘటితంగా ఎదురిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో తాలిబన్లకు ప్రతిఘటన బలగాలకు మధ్య పోరు తీవ్రతరం అయింది. ఆదివారం ఉదయం నుంచి తమ ప్రాంతంలోని పలు జిల్లాల్లో తాము తాలిబన్లపై దాడికి దిగి, వారిని హతమార్చినట్లు ఇక్కడి ప్రతిఘటనా దళాల అధికార ప్రతినిధి ఫహీం దష్తీ ట్వీటు వెలువరించారు.

వందలాది మందిని మట్టుపెట్టామని, వేయి మందికి పైగా తాలిబన్లను పట్టుకున్నామని, కొందరు సరెండర్ అయ్యారని ఈ ప్రతినిధి తెలిపారు. చాలా మంది తాలిబన్లు తమ ముందు నిలవలేక మధ్యలోనే తమంతతాముగా లొంగిపొయ్యారని చెప్పారు. ఇక్కడి కొన్ని ప్రాంతాలకు ఈ మధ్యలోనే తాలిబన్లు ఏదో విధంగా ప్రవేశించారు. అయితే వారికి ఇతర ప్రాంతాల నుంచి రోజువారి సరుకులు రావడం కష్టం అయిందని, ఇక్కడికి వచ్చిన తరువాత వారు శక్తిహీనులుగా దిగ్బంధం అయినట్లు తమకు అందిన సమాచారం మేరకు తెలిసిందని స్ఫుత్నిక్ తెలిపింది. లోయలోకి వీరు ప్రవేశించారు కానీ అక్కడ చిక్కుపడి తరువాత చంపబడినట్లు స్పష్టం అవుతోందని తెలిపారు. తాలిబన్లు ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక్క చోటనే 600 మందికి పైగా తాలిబన్లు హతులు కావడం కలకలం రేపింది. లోయలో పలు ప్రాంతాలలో ప్రతిఘటనా దళాలు మందుపాతరలు పెట్టి ఉంచారు. దీనితో తాలిబన్లు ముందుకు వెళ్లే ప్రక్రియ మందగించింది.

ఈ లోయలు గుట్టలు, జలపాతాలు అడవులు అన్నీ కూడా కేవలం ప్రతిఘటనా దళాలకే చిరపరిచితం కావడంతో ఇతరులు ఇక్కడికి రావడం అసాధ్యం అయింది. ఇక్కడ తమ పోరు సాగుతోందని, అయితే రాజధాని బజారాక్‌కు వెళ్లే రాదారిలో మందుపాతరలు ఉన్నట్లు తెలియడంతో ప్రస్తుతానికి తమ పురోగమనాన్ని క్రమబద్ధీకరిస్తున్నట్లు తాలిబన్లు తెలిపినట్లు అల్ జజీరా తెలిపింది. తాలిబన్లకు భీకర శత్రువుగా, పరమ అఫ్ఘన్ జాతీయ నేతగా ఉన్న అహ్మద్ మసూద్ సారధ్యంలో పంజ్‌షీర్‌లో జాతీయ ప్రతిఘటన కూటమి దళాలు ఏర్పాటు అయ్యాయి. తాలిబన్ల ప్రాబల్యానికి సవాలు విసురుతున్నాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News