కెన్నింగ్‌టన్: ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న నాల్గో టెస్టు ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 80 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 182 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం భారత్ 186 పరుగుల ఆధిక్యంలో ఉంది. రోరీ బర్న్, హసీబ్ హమీద్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. జోయ్ రూట్ 36 పరుగులు చేసి టాకూర్ బౌలింగ్ లో ఏడో వికెట్ రూపంలో నిష్క్రమించాడు. జానీ బయిర్ స్టో, మోయిన్ అలీ పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో ఔటయ్యారు. ఓలీ పోప్ రెండు పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ క్లీన్ బౌల్డయ్యాడు. హామీద్ 63 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. డావిడ్ మలాన్ ఐదు పరుగులు చేసి రనౌట్ రూపంలో మైదానం వీడాడు. రోరీ బర్న్ 50 పరుగులు చేసి శార్థూల్ టాకూర్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి వికెట్‌పై ఓపెనర్లు వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో ఓవర్టన్ (1), క్రిష్ వోక్స్(12) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బౌలర్లు బుమ్రా, జడేజా, శార్థూల్ టాకూర్ తలో రెండు వికెట్లు తీశారు.
ఇండియా తొలి ఇన్నింగ్స్: 191
ఇండియా రెండో ఇన్నింగ్స్: 466
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్:290