- Advertisement -
కాబూల్ : పాకిస్థాన్ నిఘా గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ అధినేత లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్, తాలిబన్ల అగ్రనేత ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ మధ్య కీలక భేటీ జరిగినట్లు నిర్థారణ అయింది. ఇది నిజమేనని , ఇరువురు సమావేశం అయ్యారని తాలిబన్ల అధికార ప్రతినిధి సోమవారం నిర్థారించారు. గత వారం ఆకస్మికంగా ఐఎస్‌ఐ చీఫ్ కాబూల్‌కు వెళ్లారు, ఈ సందర్భంగా బరాదర్‌తో భేటీ అయ్యారని, దీనిని ఇప్పుడు తాలిబన్లు నిర్థారించారని బిబిసి ఉర్దూ న్యూస్‌లో తెలిపారు. పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ మధ్య సత్సంబంధాలు ఇప్పుడు అత్యంత కీలకం అని, ఈ దశలోనే ఇరువురు భేటీ అయ్యారని వెల్లడించారు. ఈ క్రమంలోనే తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఇందుకు తలెత్తుతున్న చిక్కుల గురించి సమీక్షించుకున్నట్లు వెల్లడైంది.
- Advertisement -