శ్రీనగర్: జమ్మూ కశ్మీరు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పిడిపి) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తిని అధికారులు మంగళవారం గృహ నిర్బంధంలో ఉంచారు. కాగా..తాను బయటకు వెళ్లకుండా అధికారులు గృహ నిర్బంధం చేయడంపై మెహబూబా ముఫ్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీరులో పరిస్థితి చక్కబడినట్లు ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల్లో నిజం లేదని దీంతో తేలిపోయిందని ఆమె పేర్కొన్నారు. అఫ్ఘానిస్తాన్‌లో ప్రజల హక్కులపై ఆందోళన వ్యక్తం చేస్తున్న భారత ప్రభుత్వం కశ్మీరులో అవే హక్కులు హరిస్తోందని ఆమె ట్వీట్ చేశారు. ఇదిలాఉండగా..తన కుటుంబ సభ్యులకు చెందిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు కుల్గాం జిల్లా వెళ్లాలని మెహబూబా నిర్ణయించారని, అయితే పాకిస్తాన్ అనుకూల వేర్పాటువాద నాయకుడు సయ్యద్ లీ షా గిలానీ ఇటీవల మరణించిన నేపథ్యంలో కశ్మీరులో కల్లోలం సృష్టించేందుకు జాతి వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్న కారణంగా అక్కడకు వెళ్లవద్దని ఆమెకు సూచించామని అధికారులు వివరించారు. అందుకే ఆమెను గృహనిర్బంధం చేశామని వారు చెప్పారు.
కశ్మీరులో గృహ నిర్బంధంలో పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తి
- Advertisement -
- Advertisement -
- Advertisement -