Saturday, October 26, 2024

విభిన్న భావోద్వేగాలు, కమర్షియల్ అంశాలతో…

- Advertisement -
- Advertisement -

Gopichand said about Seetimaar movie

 

గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా హీరో హీరోయిన్లుగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీటీమార్’. కబడ్డ్డీ నేపథ్యంలో రూపొందిన ఈ భారీ స్పోర్ట్ యాక్షన్ డ్రామాను పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. వినాయక చవితి కానుకగా ఈనెల 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో గోపీచంద్ మాట్లాడుతూ “దర్శకుడు సంపత్‌నంది స్పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో చెప్పిన కథ నచ్చి ఈ సినిమా చేశాను. గతంలో వచ్చిన చిత్రాలకు భిన్నంగా అమ్మాయిల కబడ్డీ టీమ్‌ల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. అమ్మాయిల విభిన్న భావోద్వేగాలు, కమర్షియల్ అంశాలతో ఈ చిత్రం సమ్‌థింగ్ స్పెషల్‌గా రూపుదిద్దుకుంది. సిస్టర్ సెంటిమెంట్ కూడా ఈ చిత్రంలో ఉంటుంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం ఒక హైలైట్‌గా ఉంటుంది. ఇందులో హీరోయిన్ తమన్నా, భూమిక అద్భుతంగా నటించారు. కబడ్డీ అనేది అందరికీ తెలిసిన మాసివ్ గేమ్. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. మా నాన్న టి.కృష్ణ సినిమాలు చేసిన ‘ఈ తరం ఫిల్మ్’ను పునః ప్రారంభించి మళ్లీ సినిమాలు చేస్తాం. ఇక నేను చేస్తున్న ‘పక్కా కమర్షియల్’ సినిమా చివరి దశలో ఉంది”అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News