Monday, November 25, 2024

చిల్లరగాళ్ళు మితిమీరుతున్నారు

- Advertisement -
- Advertisement -

ఇకపై కుక్క కాటుకు చెప్పు దెబ్బతో సమాధానం చెబుతాం
ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే వారిని అంగట్ల కొత్త వేషగాళ్లను చూసినట్లు చూస్తున్నారు :
గ్రేటర్ టిఆర్‌ఎస్ విస్తృత సమావేశంలో విపక్షాలపై ధ్వజమెత్తిన టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మన తెలంగాణ/ హైదరాబాద్: రాజకీయాల విలువలను కాపాడాలన్న లక్షంతో ఏడేళ్ల నుంచి మనం ఎంతో సహనంగా ఉంటుంటే కొంతమంది చిల్లరగాళ్ళ మాటలు ఎక్కువ అవుతున్నాయని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మన మౌనాన్ని ప్రతిపక్షా లు చేతకాని తనంగా తీసుకుంటున్నాయన్నారు. అలా అయితే ఇకపై మనం దూకుడు పెంచాల్సిందేనని అన్నారు. కుక్క కాటుకు చెప్ప దెబ్బ అన్నట్లుగా సమాధానం చెబుతామని హెచ్చరించారు. కోటి ఆశలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు అహర్నిశలు ముఖ్యమంత్రి కెసిఆర్ శ్రమిస్తుంటే, ఆయనపై నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.

సిఎం కెసిఆర్, టిఆర్‌ఎస్‌పై బురదజల్లే యత్నాలను మానుకోని నేతలకు ఇకపై తగు రీతిలో సమాధానం చెబుతామని పార్టీ శ్రేణులను కెటిఆర్ పిలుపునిచ్చారు. సిఎం పదవికి, కెసిఆర్ వయస్సును దృష్టిలో పెట్టుకోకుండా మాట్లాడుతున్న నేతల భరతం పడదామన్నారు. టిఆర్‌ఎస్ అధికారంలో ఉందన్న కారణం గా ప్రతిపక్షాలు ఎంత రెచ్చగొట్టినా మనం ఎంతో హుందాగా వ్యవహరిస్తున్నామన్నారు. మనలో సహనం నశిస్తే పరిస్థితి ఎలా దారుణంగా ఉం టుందని విపక్ష నేతలను ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మంగళవారం  నగరంలోని జలవిహార్‌లో గ్రేటర్ టిఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పెద్దసంఖ్య లో పార్టీ శ్రేణులు హాజరయ్యారు. దీనికి ముఖ్య అతిథిగా కెటిఆర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టి.. కాంగ్రెస్, టి..బిజెపి నే తలను ఎవరూ పట్టించుకోలేదని తెలంగాణ వచ్చిన తర్వాతే కెసిఆర్ పుణ్యమా అని కొంతమందికి పదవులు దక్కాయన్నారు. వీటిని చూసుకొని కొంతమంది ఎగిరెగిరి పడుతున్నారని ఆయన విమర్శించారు. కెసిఆర్ వారికంటే వయసులో 20ఏళ్లు పెద్ద, పైగా సిఎం హోదాలో ఉన్న వ్యక్తి పై చిల్లర మాట్లాడటం తగునా? అని మండిపడ్డారు. పేరుకేమో కొన్ని ఢిల్లీ పార్టీలనీ..కానీ చేసేవి మాత్రం చిల్లర పనులంటూ ఆయన ధ్వజమెత్తారు. 70యేళ్ల కాంగ్రెస్ పాలన లో తెలంగాణ ప్రజలకు కరెంట్, తాగునీరు ఇచ్చిన పాపా నా పోలేదన్నారు. రైతులకు 24గంటల కరెంట్ తీసుకొచ్చిన ఘనత కెసిఆర్‌దేనని అన్నారు. నల్లగొండలో ఫ్లోరోసిస్ లేదని కేంద్రమే పార్లమెంట్‌లో చెప్పిందని.. ఇది తెలంగాణకు గర్వకారణం కాదా? అని కెటిఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉంటే ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని ఆయన విమర్శించారు. కెసిఆర్‌పై అవాకు లు చవాకులు పేలితే బరాబర్ సమాధానం చెప్తామని హె చ్చరించారు. సైలెంట్‌గా ఉండే కొద్ది విపక్ష నేతల మాటలు ఎక్కువైతున్నాయంటూ ఓ రేంజులో కెటిఆర్ ఫైరయ్యారు.

ప్రస్తానంలో గులాబీ జెండా గల్లీ టు ఢిల్లీకి చేరిందన్నారు. 2014లో 63 సీట్లతో ప్రారంభమైన ప్రస్థానం వరుస ఎన్నికల్లో అప్రహతీతంగా కొనసాగిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు టిఆర్‌ఎస్‌కు 88 స్థానాలు కట్టబెట్టి కెసిఆర్ నాయకత్వాన్ని మరింత బలపరిచారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 9 సీట్లు రాగా ఆ త ర్వాత వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్ పార్టీనే ఎక్కువ సీట్లను గెలుచుకుందన్నారు. కెసిఆర్ పాలనకు ప్రజలు నీరాజనం పడుతుంటే ప్రతిపక్షాలు పత్రికల్లో హెడ్‌లైన్స్ కోసమే ఆయనపై అవాకులు చేవాకులు పేలుతున్నాయన్నారు. ప్రజలు వీరిని పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టిఆర్‌ఎస్ చాలా బలంగా ఉందన్నారు. 60లక్షల పైచీలుకు సభ్యత్వం ఒక ప్రాంతీ య పార్టీకి ఉండడం చాలా అరుదైన విషయమన్నారు. హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో జిల్లా పార్టీ కా ర్యాలయాలు కట్టుకున్నామన్నారు.

తాజాగా ఢిల్లీలోనూ తె లంగాణ భవన్‌కు భూమిపూజ చేసుకున్నామని ఆయన గు ర్తు చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు ఏ ఎన్నికలు లేవన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక టిఆర్‌ఎస్‌కు సమస్యనే కాదని తేల్చిపారేశారు. కేవలం నాయకుడు ఒక్కడుంటేనే సరిపోదని….సైన్యం కూడా చాలా అవసరమన్నారు. ఇందుకోసం కమిటీలను సంస్థాగతంగా మరింత పటిష్టం చేసుకోవాల్సి న అవసరముందన్నారు. పార్టీ బలంగా ఉంటేనే మనందరికి రాజకీయ భవిష్యత్ ఉంటుందున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జిల్లా కమిటీ వేసుకోవాలా? లేక జిహెచ్‌ఎంసి కమిటీ వేసుకోవాలా? అన్న అంశంపై పార్టీ జనరల్ సెక్రటరి కె. కేశవరావు, సిఎం కెసిఆర్ సమష్టిగా నిర్ణయం తీసుకుంటారన్నారు. ఈ కమిటీల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నాయకులకు సూచించారు.

గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం 4,800 వరకు కా లనీ అసోసియేషన్లతో పాటు మరో1486 నోటిఫైడ్ బస్తీలు ఉన్నాయని కెటిఆర్ తెలిపారు. మొత్తం కలిపి 6,300 దాకా కాలనీలు, బస్తీలు ఉన్నాయన్నారు. ఈ నెల 20వ తేదీలోగా ఈ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఒక్కో కమిటీలో 15మందికి తగ్గకుండా చూసుకోవాలన్నారు. అ లాగే గ్రేటర్ పరిధిలో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయని, వాటికి కూడా కమిటీలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు అనుగుణంగా ఈ దఫా జిల్లా కమిటీలను వేసుకోవాలని ఇప్పటికే కెసిఆర్ ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారిని తప్పకుండా గౌరవించుకుంటామన్నారు. పదవుల రాలేదని ఎవరూ బాధపడొద్దన్నారు. దసరా, దీపావళి తర్వాత కొత్త కమిటీలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనన్నట్లు కెటిఆర్ తెలిపారు. తలసాని అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో పార్టీ జనరల్ సె క్రటరి కేశవరావు, మంత్రులు మహమ్మూద్ అలీ, సబితా ఇందిరారెడ్డి, మల్లారెడ్డితో పాటు పలువురు ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ప్రధాన కార్యదర్శులు తదితరులు హాజరయ్యారు.

ఉద్యమాన్ని అణిచివేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేసింది

తెలంగాణ ఉద్యమాన్ని తొక్కిపెట్టే ప్రయత్నాన్ని గతంలో పలుమార్లు కాంగ్రెస్ కుట్ర చేసిందని కెటిఆర్ ఆరోపించారు. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ ఒకే ఒక్కడుగా ఆనాడు బయలుదేరాడన్నారు. రాష్ట్ర సాధన కోసం అప్పట్లోనే డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి ఉద్యమాన్ని ప్రారంభించారన్నారు. 2004 కాంగ్రెస్‌తో 2009లో టిడిపితో పొత్తుపెట్టుకొని తెలంగాణకు అనుకూలంగా కెసిఆర్ మాట్లాడించారన్నారు. 2004లో తెలంగాణ ఇస్తానని మాట ఇచ్చి 2009లో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ మాట తప్పిందని విమర్శించారు. అందుకే కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన తరువాత విధిలేకనే కాం గ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. ఇవ్వాళ ఎగిరి పడుతున్న చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్న వాళ్ళను ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు కానలేదన్నారు.

70ఏళ్లలో జాతీయ పార్టీ లు అని చెప్పుకునే వాళ్ళు నీళ్లు, -కరెంటు ఎందుకు ఇవ్వలేకపోయాయని ఈసందర్భంగా కెటిఆర్ ప్రశ్నించారు. రైతుబందు, దళితబంధు, కెసిఆర్ కిట్, కళ్యాణలక్ష్మీ, డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు వంటి పథకాలు దేశంలో ఏరాష్ట్రంలోనైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఇలాంటి వినూత్న పథకాలను ప్రవేశపెట్టాలంటే సిఎం కెసిఆర్ వంటి వ్యక్తికే సాధ్యమన్నారు. అంతటి దమ్ము,దైర్యం ఉన్న వ్యక్తి కెసిఆర్ అని వ్యాఖ్యానించారు. అలాంటి నేత ముందు కొందరు కుప్పిగంతులు వేస్తున్నారని కెటిఆర్ మండిపడ్డారు. దాశరథి అ న్నట్లు తెలంగాణ కోటి రతనాల వీణ అన్నట్లు.. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అయిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ను ఎవ్వరూ..- ఏ పార్టీ అడ్డుకోలేదన్నారు. గతంలో టిఆర్‌ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అని…కానీ ఇప్పుడు తిరుగులేని రాజకీయ శక్తి అని అభివర్ణించారు.

త్వరలో నామినేటెట్ పోస్టులు

త్వరలోనే ఖాళీగా ఉన్న అన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని కెటిఆర్ స్పష్టం చేశారు. పార్టీలో మొదటి నుంచి కష్టపడుతున్న సోదరులకు ఇప్పటి వరకు పదవులు లభించకపోవడంతో కొంత అసంతృప్తిగా ఉన్నారన్నారు. అలాంటి వాళ్లందరికీ త్వరలోనే పోస్టులు ఇచ్చి న్యాయం చేస్తామని ఆయన హామి ఇచ్చారు. కొద్ది రోజుల్లో మొత్తం 400 నామినేటెట్ పోస్టులను కూడా భర్తి చేస్తానన్నారు. అది కూడా తాను దగ్గరుండి ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.

శ్రుతిమించితే హైదరాబాద్‌లో తిరగలేరు:

ప్రతిపక్షాలపై మరోసారి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ఒక వైపు హైదరాబాదులో తాము చేసిన అభివృద్ధి కనిపిస్తూనే ఉన్నా విపక్ష నేతలు సో షల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మం డిపడ్డారు. డబుల్ బెడ్ రూం ఇళ్లపై ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. విపక్షనేతల తీరు శ్రుతిమించితే హైదరాబాదులో తిరగలేరని ఈ సందర్భంగా తలసాని హెచ్చరించారు. హైదరాబాదులో మరే పార్టీకి లేని క్యాడర్ తమకుందన్నారు. విపక్షనేతలకు కెసిఆర్, కెటిఆర్ ను తట్టుకునే శక్తే లేదని అని

అలరించిన డాక్యుమెంటరీ

కెసిఆర్ పుట్టినప్పటి నుంచి మొదలుకుని ప్రస్తుత ప్రస్థానం వరకు చోటుచేసుకున్న ప్రధాన అంశాలను తీసుకుని మం త్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన వీడియో డాక్యుమెంటరీ పార్టీ శ్రేణులను విశేషంగా ఆకర్శించింది. అలాగే కెసిఆర్ బాల్యం, వారి తల్లిదండ్రు లు, పూర్వికులు, రాజకీయ ప్రస్తానం, సాధించిన విజయాలపై కూడా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కూడా పలువురు అమితంగా ఆకట్టుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News