- Advertisement -
హైదరాబాద్ : టాలీవుడ్ ను కుదిపేసిన డ్రగ్స్ కేసులో నటీనటులను ఇడి అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మీ, నటి రకుల్ ప్రీత్ సింగ్, నందును ఈడీ అధికారులు విచారించారు. ఈ క్రమంలో బుధవారం నటుడు దగ్గుబాటి రానాను ఇడి అధికారులు విచారిస్తున్నారు. బ్యాంక్ స్టేట్ మెంట్ లతో సహా రానా విచారణకు హాజరయ్యారు. నవదీప్ తో ఉన్న సంబందాలు, ఆర్థిక లావాదేవీలపై ఇడి విచారణ చేయనుంది. సాయంత్రం వరకు విచారణ కొనసాగనుంది. డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి ఇడి ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -