Saturday, November 23, 2024

తేజస్వి, చిరాగ్ సమావేశంతో బీహార్‌లో రాజకీయ వేడి

- Advertisement -
- Advertisement -

Political heat in Bihar with Tejaswi, Chirag meeting

కొత్త పొత్తుకు సంకేతమని ఊహాగానాలు

పాట్నా : బీహార్‌లో లోక్‌జన్‌శక్తి, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీల యువనేతలు బుధవారం సమావేశం కావడం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. లోక్‌జన్‌శక్తి నేత చిరాగ్ పాశ్వాన్ బుధవారం రాష్ట్రీయ జనతాదల్ నేత తేజస్వియాదవ్‌తో సమావేశం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. తనతండ్రి సంవత్సరీకం సందర్భంగా తేజస్విని పిలవడానికి వచ్చినట్టు చిరాగ్ చెప్పారు. అయితే ఆర్‌జెడి, ఎల్‌జెపి మధ్య గట్టి పొత్తు కుదరడానికి ఇది సంకేతమని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. 2010 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన తండ్రి లాలాఊ ప్రసాద్ యాదవ్‌తో కలసి దివంగత రామ్‌విలాస్ పాశ్వాన్ ప్రచారంలో పాల్గొన్నారని అప్పటి ప్రచారం నుంచి తాను కొన్ని పాఠాలు నేర్చుకోగలిగానని తేజస్వియాదవ్ గుర్తు చేశారు.

తనతండ్రి ఆరోగ్యం బాగుంటే ఢిల్లీ వెళ్లి కలుస్తానని చిరాగ్ చెబుతున్నారని పేర్కొన్నారు. లాలా నిర్బంధంలో ఉండడం, అనారోగ్యం కారణాల వల్ల గత ఏడాదిపాశ్వాన్ అంత్యక్రియలకు తన తండ్రి హాజరు కాలేక పోయారని వివరించారు. ఈరోజు సమావేశానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తేజస్వితో సమావేశం తరువాత మీడియాతో చిరాగ్ మాట్లాడుతూ మాతండ్రి పాశ్వాన్ చనిపోయి ఏడాది కావస్తోందని, ఈసందర్భంగా ఈనెల 12న కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దానికోసం తేజస్విని ఆహ్వానించానని, రేపు ఢిల్లీకి వెళ్లి లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలుసుకుంటానని తెలిపారు. తన తండ్రితో కలసి పనిచేసిన ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తానని, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను కూడా ఆహ్వానిస్తానని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News