Friday, November 22, 2024

56 సరికొత్త సైనిక రవాణా విమానాలు

- Advertisement -
- Advertisement -

Cabinet approves procurement of 56 transport aircraft

స్పెయిన్‌తో డీల్‌కు కేంద్రం ఆమోదం
కాంట్రాక్టులో టాటా సంస్థకు వాటా
కొనుగోళ్ల విలువ రూ 21000 కోట్లు

న్యూఢిల్లీ : దేశంలోకి త్వరలోనే సరికొత్త సైనిక రవాణా విమానాలు రానున్నాయి. 60 ఏండ్ల క్రితం నాటి ఇప్పటి భారత వైమానిక దళం (ఐఎఎఫ్) విమానాల స్థానంలో 56 వరకూ సి 295 ఎండబ్లు ట్రాన్స్‌పోర్టు విమానాలను కొనుగోలు చేయనున్నారు. ఈ మేరకు భారత ప్రభుత్వం స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్, డిఫెన్స్ అండ్ స్పేస్‌తో ఒప్పందానికి బుధవారం జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ డీల్‌లో టాటా కన్సార్టియమ్ తయారీ విభాగానికి కూడా కీలక స్థానం దక్కింది. వాయుదళానికి చెందిన ప్రస్తుత పాతబడ్డ ఎవ్రోస్ సైనిక రవాణా విమానాల స్థానంలో ఇవి చోటుచేసుకుంటాయని అధికారిక ప్రకటనలో తెలిపారు.

ఈ విమానాల కొనుగోళ్లకు సంబంధించి దాదాపు రూ 21,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కాంట్రాక్టుపై సంతకాల తదుపరి 48 నెలల లోపున మొత్తం 56 విమానాలలో 16 వరకూ ప్రయాణ సామర్థంతో స్పెయిన్ నుంచి ఇక్కడికి చేరుకుంటాయి. ఇక కాంట్రాక్టులో భాగస్వామ్యం అయిన టాటా సంస్థ పది సంవత్సరాలలో 40 విమానాలను తయారు చేస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. సైనిక విమానం దేశంలో ఓ ప్రైవేటు కంపెనీ తయారుచేయడం ఇదే తొలిసారి అవుతుంది.ఈ సైనిక రవాణా విమానాలు 5 నుంచి 10 టన్నుల బరువును మోసుకువెళ్లుతాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో , అత్యవసర స్థితిలో సైనిక బలగాలు కానీ సరుకులను కానీ అత్యంత అనువుగా నిర్ణీత ప్రాంతంలో చేర్చే రీతిలో ర్యాంప్ డోర్స్ ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News