Saturday, November 16, 2024

తెలంగాణ భాషకు కాళోజీ అస్తిత్వాన్ని ఇచ్చారు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎవని భాషను వాడు రాయాలె, మాట్లాడాలె‘ అనే కాళోజీ మాతృభాష స్ఫూర్తి రాష్ట్ర సాంస్కృతిక ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిందని సిఎం పేర్కొన్నారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ అస్తిత్వ స్పృహను అందించారని ప్రశంసించారు. వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ అమ్మ భాషకు సాహితీ గౌరవాన్ని మరింతగా పెంచేందుకు తెలంగాణ సాహితీ వేత్తలు కృషిని కొనసాగించాలన్నారు. తెలంగాణ భాషా సాహిత్య రంగాల్లో కృషిచేస్తున్న కవులు రచయితలను గుర్తించి వారికి కాళోజి పేరున పురస్కారాలను అందిస్తూ ప్రభుత్వం గౌరవించుకుంటున్నదిని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ‘పుటుక నీది చావు నీది బతుకంతా దేశానిది‘ అని నినదించిన కాళోజి జీవితం అంతా తెలంగాణ భాషా సాహితీ సేవ దిశగా సాగిందన్నారు. ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే కాళోజీ పురస్కారాన్ని ఈ సంవత్సరానికి గాను అందుకుంటున్న, ప్రముఖ కవి రచయిత పెన్నా శివరామ కృష్ణకు సిఎం కెసిఆర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

KCR Greets People on Telangana Language Day

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News