Friday, November 22, 2024

‘గ్లోబల్ టీచర్ అవార్డు’ తుది జాబితాలో హైదరాబాద్ టీచర్..

- Advertisement -
- Advertisement -

లండన్: ఈ ఏటి ప్రపంచ స్థాయి మేటి ఉపాధ్యాయ పురస్కార విజేతల తుది జాబితాలో హైదరాబాద్‌కు చెందిన ఇంగ్లీషు, గణితం ఉపాధ్యాయురాలు మేఘన మసునూరికి స్థానం దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ టీచర్స్ ప్రైజ్ పరిధిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా నిలిచిన వారికి పదిలక్షల డాలర్ల భారీ పారితోషికం ఉంటుంది. ఈ పురస్కారానికి ఖరారు అయిన తుది జాబిలోని 50 మందిలో భారతీయులు ఇద్దరే ఉన్నారు. వీరిలో హైదరాబాదీ ఒకరు కాగా మరొకరు బీహార్‌లోని భగల్పూరుకు చెందిన లెక్కల టీచరు సత్యం మిశ్రా కూడాఉనానరు. యునెస్కో భాగస్వామ్యంతో వార్కె ఫౌండేషన్ ఈ అవార్డును ఏర్పాటు చేసింది. 121 దేశాల నుంచి ఈ పురస్కారానికి 8 వేల దరఖాస్తులు వచ్చాయి. విద్యా ప్రమాణాలను పరిరక్షించడం అనేది కీలకం. రేపటి భవిష్యత్తును పరిరక్షించేందుకు విద్యారంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.

పలు సవాళ్లను ఎదుర్కొంటూ రేపటిని మరింత విశ్వాసంతో సరైన రీతిలో దక్కించుకునేందుకు ఇటువంటి పురస్కారాల ఏర్పాటు అవసరం అని వార్కే ఫౌండేషన్ వ్యవస్థాపకులు సన్నీ వార్కే తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఇప్పుడు వడబోయగా 50 మందితో తుది జాబితాను సిద్ధం చేశారని, వీరిలో నుంచి అత్యుత్తమ టీచర్‌ను ఎంపిక చేయడం జరుగుతుందని వివరించారు. ఈ జాబితాలో ఫైనల్ లిస్టుకు ఎంపికైన మేఘన హైదరాబాద్‌లోని ఫౌంటెన్‌హెడ్ గ్లోబల్ స్కూల్ టీచరుగా ఉన్నారు. సాంఘీక శాస్త్రం, ఇంగ్లీషు, మ్యాథ్స్ టీచరు అయిన మేఘన పలు సేవా కార్యక్రమాలు, ధార్మిక విద్యా ప్రోత్సాహక పథకాలతో ప్రశంసలు పొందారు.

Hyd Teacher shortlisted for 2021 Global teacher prize

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News