మన తెలంగాణ సిటీబ్యూరో: నగర కేంద్రంగా ఉన్న డిజిటల్ హెల్త్‌కేర్ స్టారప్ట్ హీల్పా తమ యాప్‌ను ఆవిష్కరించింది. ప్రతి వ్యక్తి ఆరోగ్యం నిర్వహించుకునే అవకాశాన్ని ఈయాప్ మెరుగుపరుస్తుంది. టెలి మెడిసిసన్, వ్యక్తిగత సంరక్షణ కోసం కనెక్ట్ చేయబడిన ఆరోగ్య సంరక్షణ నివారణ, నిర్వహణ, చికిత్సను అందించే సమగ్రమైన నిర్వహణ ఉపకరణంగా వైద్యులకు, రోగుల మధ్య నిలుస్తుంది. ఈనూతన యాప్, రోగులకు తమ వైద్య స్దితి తెలుసుకోవడంతో పాటుగా సంబంధిత ఆరోగ్య సంరక్షణను వేగంగా, సమర్దవంతంగా పొందేందుకు సహాయపడటానికి లక్షంగా చేసుకుంది. ఈసందర్భంగా ఆసంస్ద ఫౌండర్ అండ్ సీఎస్‌ఓ రాజ్ జనపరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణంలో హెల్త్ మార్కెట్‌లో మేము వేగవంతమైన వృద్దిని చూస్తున్నాం, హెల్త్‌కేర్ పరిశ్రమ స్దిరంగా ఆవిష్కరణలను జరుపుకుంటుంది. ఈమారిన వాతావరణంలో రోగులు, డాక్టర్ల నడుమ అంతరాలను పూరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. నూతన యాప్ మెరుగైన ఫలితాలను పొందడంలో రోగులకు సహాయపడగలదని నమ్ముతున్నట్లు వెల్లడించారు.
రోగులు, వైద్యుల సమన్వయం కోసం హీల్పా మొబైల్ హెల్త్‌కేర్ యాప్ ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -
- Advertisement -