Thursday, December 5, 2024

శిక్షణ పూర్తి చేసిన బీటు అధికారులు

- Advertisement -
- Advertisement -

విధి నిర్వహణలో అకింతభావంతో పనిచేయాలి
పిసిసిసిఎఫ్ ఆర్. శోభ

Beet officers training closed in Telangana
మనతెలంగాణ/హైదరాబాద్ : ఉన్నత విద్యార్హతలు కలిగినవారు అటవీ ఉద్యోగాలకు ఎంపిక కావడం శుభపరిణామమని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. శాంతి కుమారి వ్యాఖ్యానించారు. 38 మంది ఫారెస్ట్ బీట్ అధికారుల ఆరు నెలల శిక్షణ ముగింపు సందర్భంగా దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో జరిగిన 29వ బ్యాచ్ ఫారెస్ట్ బీట్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ 38 మందిలో 13 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్, 25 మంది గ్రాడ్యుయేషన్ చదివినవారు బీటు అధికారులుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ నుంచి ఎంపిక అయ్యారు.ఈ సందర్భంగా పిసిసిసిఎఫ్ ఆర్. శోభ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అటవీ రక్షణకు, పచ్చదనం పెంపునకు ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని, శిక్షణ పూర్తి చేసిన బీటు అధికారులు విధి నిర్వహణలో అకింతభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అటవీ సంబంధిత విషయాలతో పాటుగా వీరికి వెపన్ ట్రైనింగ్, సర్వే ట్రైనింగ్, జీప్ నడపడంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చామని ఫారెస్ట్ అకాడెమీ డైరెక్టర్ తెలిపారు. శిక్షణలో భాగంగా వివిధ రంగాల్లో మంచి ప్రతిభ కనపరిచినవారిని ఉన్నతాధికారులు సత్కరించారు. ప్రతీ ఏటా విధి నిర్వహణలో ఉత్తమంగా పనిచేసిన అటవీ అధికారికి ఇచ్చే కెవిఎస్ బాబు సంస్మరణ అవార్డును ఈ ఏడాది కొత్తగూడెం ఫారెస్ట్ రేంజీ అధికారి సిహెచ్. శ్రీనివాస రావుకు అందుజేశారు. ఆయనను బంగారు పతకంతో పాటు, 15 వేల రూపాయల రివార్డుతో ఉన్నతాధికారులు సత్కరించారు. అంతకు మందు దూలపల్లి ఫారెస్ట్ అకాడెమీలో జరిగిన కాళోజీ జయంతి ఉత్సవాల్లో ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అటవీ సంరక్షణ అధికారిఆర్.ఎం.డోబ్రియల్, ఫారెస్ట్ అకాడమీ సంచాలకులు పి.వి.రాజా రావు, అధికారులు బుచ్చిరామ్ రెడ్డి, కె. శివజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News