- Advertisement -
ఢిల్లీ కోర్టుకు తెలిపిన ఉడాయ్
న్యూఢిల్లీ : వ్యక్తులకు కేటాయించిన ఆధార్ సంఖ్యను మార్చివేసి మరో సంఖ్యను కేటాయించడం సాధ్యం కాదని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్ ) ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఇలాంటివి కనుక ఒకసారి అనుమతిస్తే వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు మాదిరిగా తమకు నచ్చిన ఫ్యాన్సీ నంబర్ల కోసం ప్రతి ఒక్కరి నుంచి అభ్యర్థనలు వెల్లువెత్తే అవకాశం ఉందని పేర్కొంది. ఓ వ్యాపారి తనకు కేటాయించిన ఆధార్ సంఖ్యను మార్చాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఆధార్ గుర్తు తెలియని విదేశీ సంస్థలకు అనుసంధానమై ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. ఈ విచారణను జస్టిస్ రేఖా వల్లీ విచారణకు చేపట్టారు. ఉడాయ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రతి ఆధార్ కార్డుదారు అందించిన సమాచారానికి పూర్తి భద్రత ఉంటుందన్నారు.
- Advertisement -