- Advertisement -
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్‌గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా ‘లవ్ స్టోరి‘. ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ “తప్పనిసరి పరిస్థితుల వల్ల ఇన్నాళ్లూ మా ‘లవ్ స్టోరి‘ చిత్రాన్ని వాయిదా వేస్తూ వచ్చాం. చివరికి ఈ నెల 24న ‘లవ్ స్టోరి’ చిత్రాన్ని థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము”అని అన్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు.
- Advertisement -