Saturday, November 16, 2024

9/11 దాడులకు గుర్తుగా బైడెన్, ఒబామా, క్లింటన్ సంఘీభావం

- Advertisement -
- Advertisement -

Biden, Obama, Clinton solidarity to mark 9/11 attacks

 

న్యూయార్క్: న్యూయార్క్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఉగ్రదాడి స్మారక వార్షిక దినం సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్‌క్లింటన్ , ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ తమ భార్యలతో కలసి మౌనంగా శ్రద్ధాంజలి ఘటించారు. వరల్డు ట్రేడ్ సెంటర్ టవర్స్ వద్ద ఈ ముగ్గురూ బ్లూరిబ్బన్లు ధరించి తమ హస్తాలను ఛాతీపై వేసుకుని మౌన ప్రదర్శనలో పాల్గొన్నారు. వందలాది మందితో సాగిన ఈ ప్రదర్శనలో కొందరు దాడుల్లో మృతి చెందిన తమ ప్రియతములైన వారి ఫోటోలను ప్రదర్శించారు. ప్రదర్శనకు ముందు జెట్ విమానం గగన తలంలో దాడుల శబ్దం చేస్తూ విహరించింది. ఆనాడు దాడులు జరిగినప్పుడు బైడెన్ సెనేటర్‌గా ఉన్నారు. ఇప్పుడు కమాండర్ ఇన్ ఛీఫ్‌గా స్మారక వార్కిక కార్యక్రమాన్ని నిర్వహించారు. మిగతా ఇద్దరి మాజీ అధ్యక్షులు ప్రసంగించడానికి అవకాశం కల్పించారు. శుక్రవారం వైట్‌హౌస్ బైడెన్ ప్రపంగం టేప్‌ను విడుదల చేసింది. దాడుల తరువాత జాతీయ సమైక్యత మరోసారి స్పష్టమైందన్నారు. సెప్టెంబర్ 11 దాడులు ఐక్యత అన్నది గొప్పశక్తి అన్న గుణపాఠం చెప్పాయని బైడెన్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News