Friday, November 22, 2024

ట్యాంక్‌బండ్‌కు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

- Advertisement -
- Advertisement -
RTC Special Services to Tank Bund
ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటలకు రాత్రి 10.30 గంటల తర్వాత

హైదరాబాద్: ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు, రాత్రి 10.30 గంటల తర్వాత ట్యాంక్‌బండ్‌కు ప్రత్యేక బస్సు సర్వీస్‌లు నడుస్తాయని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా ప్రతి ఆదివారం సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై వాహనాలను నిషేధించిన నేపథ్యంలో ఈ 5 గంటలపాటు ప్రత్యామ్నాయ రూట్లలో బస్సులు నడవనున్నాయని ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి సెక్రటేరియెట్ వైపు వెళ్లే బస్సులు సికింద్రాబాద్ రాణిగంజ్, బోట్స్‌క్లబ్, మారియేట్ హో టల్, కట్ట మైసమ్మ గుడి, లిబర్టీ మీదగా కోఠి వైపు లక్డీకాపూల్ వైపు వెళ్లుతాయని తెలిపారు. ఆ రెండు రూట్ల ద్వారా సికింద్రాబాద్ వైపు వచ్చే బస్సులు తెలుగుతల్లి ప్లై ఓవర్ మీదగా డిబిఆర్ మిల్, మారియేట్ హోటల్, బైబిల్ హౌస్ రాణిగంజ్ మీదగా సికింద్రాబాద్ వైపు చేరుకుంటాయని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News