లక్నో : బాబ్రీ మసీదు కేసుపై తీర్పు వెలువడిన తరువాత మొదటిసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో వివిధ పార్టీలు అయోధ్య కేంద్రంగా తమ ప్రచార వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. బిజెపి, ఎస్పి, బిఎస్పి పార్టీలు అయోధ్యను తమ ప్రచార వ్యూహంగా ఉపయోగించుకుంటున్నాయి. కొత్తగా వచ్చిన ఎఐఎఐఎం , జనసత్తా లోక్తాంత్రిక్ దళ్, వంటి ఇతర చిన్నపార్టీలు కూడా అయోధ్యనే కేంద్రంగా చేసుకుంటున్నాయి. అయోధ్య అసెంబ్లీ నియోజక వర్గానికి ప్రస్తుతం బిజెపి ఎమ్ఎల్ఎ వేద్ ప్రకాష్ గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2020 ఆగస్టు 5 న ప్రధాని నరేంద్రమోడీ, అయోధ్యలో భూమి పూజ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తరచుగా అయోధ్యను సందర్శిస్తున్నారు. బిజెపి అయోధ్య అంశాన్ని ఎప్పటికప్పుడు అయోధ్య అంశానికి జీవం పోస్తోంది. సెప్టెంబర్ 5 న ప్రబుధ్ సమ్మేళన్ పేరుతో బిజెపి మేధావుల సమావేశం నిర్వహించింది. ఆ రాష్ట్ర బిజెపి అధినేత స్వతంత్ర దేవ్‌సింగ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.