Monday, November 25, 2024

ఐరాస అణు నిఘాకు ఇరాన్ అనుమతి

- Advertisement -
- Advertisement -

Iran allowing UN inspections on nuclear programs

 

టెహ్రాన్: తమ దేశ పౌర అణుకార్యక్రమాలపై ఐక్యరాజ్యసమితి(ఐరాస) తనిఖీలకు అనుమతిస్తున్నట్టు ఇరాన్ తెలిపింది. తమ దేశంలో అణు కార్యక్రమాలు జరిగే సున్నిత ప్రాంతాల్లో ఐరాస తనిఖీ బృందాలు నిరంతరం ఫిల్మ్ తీసుకునేందుకు వీలు కల్పించే కొత్త మెమొరీ కార్డులను నిఘా కెమెరాల్లో పెట్టుకునేందుకు అనుమతిస్తున్నట్టు ఇరాన్ తెలిపింది. అంతర్జాతీయ అణుశక్తి సంఘం(ఐఎఇఎ) డైరెక్టర్ జనరల్ రఫేల్‌గ్రోసీతో భేటీ అనంతరం ఇరాన్ అణుకార్యక్రమం చీఫ్ మహ్మద్ ఇస్లామీ ఈ ప్రకటన చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఐఎఇఎ తనిఖీ అధికారులను తమ దేశంలో నిఘాకు ఇరాన్ అనుమతించకపోవడం గమనార్హం. అణు కార్యక్రమాలపై అగ్రదేశాలతో ఇరాన్ కుదుర్చుకున్న ఒప్పందం రద్దయిన తర్వాత అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ వారంలో పాశ్చాత్య దేశాల అధినేతలు ఇదే అంశంపై చర్చించనున్న నేపథ్యంలో ఇరాన్ కాస్త మెత్తబడటం గమనార్హం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News