న్యూయార్క్: యూఎస్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో రెండో సీడ్ రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ సంచలన విజయంతో టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఫైనల్ పోరులో ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు, టాప్ సీడ్ సెర్బియాకు చెందిన నొవాక్ జకోవిచ్‌ను వరుస సెట్లలో ఓడించి మెద్వెదెవ్ సత్తా చాటాడు. న్యూయార్క్ సిటీలోని ఆర్థర్ ఆషే స్టేడియంలో ఉత్కంఠగా జరిగిన ఈ పోరులో మెద్వెదెవ్ 6-4, 6-4, 6-4 తేడాతో జకోవిచ్‌పై అద్భుత విజయాన్ని సాధించి మొదటిసారిగా గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. 2019లో రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకున్న మెద్వెదెవ్.. ఈ సారి టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. మరోవైపు టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లు గెలుచుకున్న క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాలనే జకోవిచ్ ఆశలు అవిరాయ్యాయి. దీంతో జకోవిచ్ తన కలను సాకారం చేసుకునేందుకు ఇంకొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే. జకోవిచ్ ఇప్పటికే 20 గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లను గెలిచిన విషయం తెలిసిందే.
The moment @DaniilMedwed did the unthinkable. pic.twitter.com/rucHjhMA63
— US Open Tennis (@usopen) September 12, 2021
Medvedev won US Open 2021 Title