- Advertisement -
కెప్టెన్సీ మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదు
బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్
ముంబై: టీ20 వరల్డ్ప్ 2021 తర్వాత వన్డే, టీ20 ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకోబోతున్నట్టు వచ్చిన వార్తలను బిసిసిఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ఖండించారు. మూడు ఫార్మాట్లలోనూ భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా విరాట్ కోహ్లి కొనసాగుతారని, రోహిత్ శర్మ వైట్ బాల్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించడం లేదని తేల్చిచెప్పారు. ఇప్పటిదాకా ఈ విషయం గురించి ఎలాంటి చర్చ జరగలేదని ఆయన తెలిపారు. కాగా అక్టోబర్లో యూఎఈ, ఒమన్ వేదికగా జరిగే టీ20 వరల్డ్ప్ కోహ్లీకి పరిమిత ఓవర్ల కెప్టెన్గా ఆఖరి టోర్నమెంట్ అని వదంతులు వినిపించిన విషయం తెలిసిందే. ఈ విషయమై జాతీయ మీడియా సైతం కథనాలను ప్రసారం చేశాయి.
- Advertisement -