మన తెలంగాణ / కరీంనగర్ ప్రతినిధి: హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు సర్వేను సమర్థవంతంగా నిర్వహించిన అధికా రులను జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ అభినందించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో క్లస్టర్ అధికారులు, ప్రత్యేక అధి కారులతో దళితబంధుపై ఆయన సమీక్ష స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క లెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు సర్వే విజ యవంతంగా పూర్తిచేశామని, ఇప్పటివరకు 14,400 లబ్ధిదారుల ఖాతాల లో డబ్బులు జమ అయ్యాయని తెలిపారు. బుధవారం నుంచి అధికారులు రీ సర్వే చేస్తారని, దళిత కుటుంబాలందరికీ దళిత బంధు పథకం అమలవుతుందని అన్నారు.
రీ సర్వే లో రేషన్ కార్డ్ లేని వారి వివరాలు తీసుకోవాలని, మైగ్రేట్ అయిన వారి వివరాలు కూడా తీసుకోవాలని, వాటన్నిటినీ ఆప్ లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. రీ సర్వే లో భాగంగా బ్యాంకర్లను కూడా వెంట తీసుకెళ్లి గుర్తించిన కొత్త వారికి కూడా బ్యాంక్ అకౌంట్ లో తెరిపించాలని అన్నారు. మొదటిసారి సర్వే చేసినప్పుడు ఇంటికి తాళం వేసి ఉంటే రీ సర్వే లో వారిని గుర్తించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఖాతాలో డబ్బులు జమ కాగానే సెల్ ఫోన్ లకు సంక్షిప్త సమాచారం వస్తుందని, దీన్ని అధికారులు దృవీక రించుకోవాలని అన్నారు. దళిత కుటుంబాల అందరికీ దళిత బంధు పథకం అమలు చేయడంతో పాటు వారి ఖాతా లో వెంటనే డబ్బులు జమ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమ ఆగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జడ్పీ సీఈఓ ప్రియాంక, క్లస్టర్ అధికారులు, ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.