- Advertisement -
వాషింగ్టన్ : అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్టు ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళ అంగీకరించింది. దీంతో నిందితురాలు మయామీ నర్స్‌కు ఫెడరల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 39 ఏళ్ల నివియాస్ పెటిట్‌ఫెల్ప్ హారిస్ నల్లజాతికి చెందిన వ్యక్తి కాకపోవడం వల్లనే ఆమెను హత్య చేస్తానని ఆరుసార్లు బెదిరించానని, విచారణ అధికారుల ఎదుట చెప్పినట్టు తెలుస్తోంది. హత్యకు పన్నాగాన్ని వివరిస్తూ తనంత తానుగా తీసుకున్న 30 సెకండ్ల నిడివి గల వీడియో క్లిప్పులను జైలులో ఉన్న తన భర్తకు పంపినట్టు న్యాయస్థానం గుర్తించింది. హారిస్ హత్య కోసం కొందరు వ్యక్తులతో 50 వేల డాలర్లకు బేరం కుదుర్చుకున్నానని, 50 రోజుల్లోనే ఆమెను చంపేస్తానని ఆ వీడియో క్లిప్పుల్లో రికార్డయి ఉంది.
- Advertisement -