Friday, November 15, 2024

బొగ్గు కొరతపై ప్రభుత్వాన్ని హెచ్చరించిన కోల్ ఇండియా

- Advertisement -
- Advertisement -

Singareni produced 48.67 lakh tonnes of coal in july

చెన్నై: ప్రస్తుతం దేశంలో ఉన్న బొగ్గు నిల్వలు వానా కాలం అంతానికల్లా అంతరించిపోతాయాని, కనుక బొగ్గును కొనుగోలుచేయాల్సి ఉంటుందని కోల్ ఇండియా ప్రభుత్వానికి తెలపింది. ఈ మేరకు విద్యుత్ మంత్రిత్వశాఖ సలహాదారుకు తెలిపింది. ప్రపంచంలో బొగ్గు నిల్వలు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ నాలుగవ స్థానంలో ఉంది. ప్రస్తుతం అనేక విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్స్‌లో బొగ్గు కొరత ఉన్నందున, నిలలు తగ్గిపోతున్న కారణంగా బొగ్గును దిగుమతి చేయాని కోల్ ఇండియా ప్రభుత్వాన్ని కోరింది.
బొగ్గు కొరత సంక్షోభం రోజురోజుకు పెరుగుతోందని ప్రభుత్వ సంస్థ అయిన కోల్ ఇండియా ఫిబ్రవరి 4న కేంద్ర విద్యుత్తు సంస్థ(సిఇఎ)కు రాసిన సమీక్ష లేఖలో పేర్కొంది. విద్యుత్తు ప్లాంట్లకు వెంటనే బొగ్గు సరఫరాను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కూడా కోరింది. 135 విదుత్తు ప్లాంట్లలో దాదాపు 100 ప్లాంట్లకు సెప్టెంబర్ 13నాటికి కేవలం వారానికి సరిపడేంత నిల్వలే మిగిలి ఉన్నట్లు సమాచారం. ఫెడరల్ మార్గదర్శకాల ప్రకారం కనీసం రెండు వారాలకు సరపడేంత బొగ్గు నిలలు ఖచ్చితంగా ఉండాలనది నిబంధన.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News