- Advertisement -
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటి వరకు 76.11 కోట్లకు పైగా డోసుల కొవిడ్-19 వ్యాక్సిన్ సమకూర్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ఇవిగాక మరో 1.65 కోట్ల డోసులకు పైగా వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధమవుతోందని మంత్రిత్వశాఖ వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 5.33 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయని తెలిపింది. దేశ వ్యాప్త వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొవిడ్ వ్యాక్సిన్‌ను కేంద్రం ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.
- Advertisement -