Saturday, November 23, 2024

గేమింగ్ హౌస్‌పై పోలీసుల దాడి

- Advertisement -
- Advertisement -
Cyberabad Police raid gaming house in hyderabad
పేకాడుతున్న 13మంది అరెస్టు

హైదరాబాద్: గేమింగ్ హౌస్‌పై దాడి చేసి పేకాడుతున్న 13మందిని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నగదు రూ. 8,600, బ్యాంక్‌లోని నగదు రూ.90,34,569ను సీజ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం…. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ కెజిఎన్, ప్రిస్టిన్ కమ్యూన్‌లో కొందరు పేకాడుతున్నారనే సమాచారం రావడంతో మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు దాడి చేశారు. అక్కడ పేకాడుతున్న నీరజ్ కుమార్ ఆర్గనైజర్, ధృవ, జగన్నాథ రాజేష్, సిజే రమణ, దొంతలూరి రాజశేఖర్, మిట్టపల్లి పవన్‌కుమార్, చిక్కుడు సాయికృష్ణ, గడ్డమోమి సంతోష్, రాహుల్ చౌహాన్, హోసూర్ రఘు, అలీ హిరాణి, సిజె క్రాంతి, వివిఎన్ శ్రీకాంత్‌ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మొత్తం రూ. 1,80,00,000 సొత్తు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కోసం రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News