Friday, November 22, 2024

ఆయిల్‌పాం విత్తనాల దిగుమతిపై సుంకం తగ్గించండి

- Advertisement -
- Advertisement -
Reduce tariff on import of oil palm seeds
కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శికి సిఎస్ విజ్ఞప్తి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం లో రికార్డ్ స్థాయిలో 20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్‌ను చేపడుతున్నందున, ఈ ప్లాంటేషన్ కు విదేశాల నుండి దిగుమతి చేసుకునే ఆయిల్ పామ్ విత్తనాలకు కస్టమ్స్ సుంకాన్ని తగ్గించేలా తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. రాజేంద్రనగర్ లోని భారత తృణధాన్యాల సంస్థలో ఏర్పాటుచేసిన ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ అగర్వాల్‌తో సోమేశ్ కుమార్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

రాష్ట్రంలో తలపెట్టిన 20 లక్షల ఎకరాల ఆయిల్ పామ్ ప్లాంటేషన్‌లకు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న నాణ్యమైన విత్తనాలు లభించేలా చూడాలని సిఎస్ కోరారు. ఈ సందర్భంగా భారత తృణధాన్యాల సంస్థలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో వ్యవసా య రంగంలో చేపట్టిన పలు కార్యక్రమాలను, 20 లక్షల ఎకరాల్లో చేపడుతున్న ఆయిల్ పామ్ ప్లాంటేషన్ తదితర అంశాలను కేంద్ర మంత్రికి వివరించారు. ఐఐఎంఆర్‌లు ఏర్పాటు చేసిన న్యూట్రీ -సీరియల్ సెంటర్, మిల్లెట్ ప్రాసెసింగ్ యూ నిట్, గ్లాస్ హౌస్ రీసర్చ్ సౌకర్యాల సంస్థల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో కలిసి ఆయన పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News