- Advertisement -
గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆదేశాలు జారీ చేసిన ముగ్గురు సిపిలు
మనతెలంగాణ, సిటిబ్యూరోః హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని వినాయకుడి విగ్రహాల నిమజ్జనం సందర్భంగా మద్యం షాపులను రెండు రోజులు బంద్ చేస్తూ ఆయా పోలీస్ కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 19,20వ తేదీల్లో మద్యం షాపును బంద్ చేయాలని స్పష్టం చేశారు. 19వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 6గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, పబ్బులు మూసివేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, స్టిఫెన్ రవీంద్ర, మహేష్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు.
- Advertisement -