=కలెక్టర్ కార్యాలయం చుట్ట్టూ జనం ప్రదక్షిణలు
=సన్నబియ్యం పంపిణీతో రేషన్ బియ్యంకు డిమాండ్
=గత నాలుగేళ్ల నుంచి సరుకులు కోల్పుతున్నామని ఆవేదన
=నలుగురు సభ్యులున్న ఇద్దరు తీసుకునే పరిస్థితి ఉందని విమర్శలు
=చిన్న పిల్లలు, కొత్తగా ప్ళైన వారు నోచుకొని రేషన్ సన్నబియ్యం
మన తెలంగాణ/సిటీబ్యూరో: నగరంలో కొత్తరేషన్ కార్డులు మంజూరు కాగా, పాత కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయాలని కలెక్టరేట్ కార్యాలయం చుట్టు నగర ప్రజలు ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులతో పాటు, పిల్లల పేరు చేర్చుకపోవడంతో రేషన్ బియ్యం కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయ ంలో బియ్యం కోసం ఇబ్బందులు పడి ప్రైవేటు దుకాణాల వద్ద రూ. 50 కేజీ చొప్పన కొనుగోలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. అదే ఆహరభద్రత కార్డులో పేరు నమోదు చేసుంటే సకాలంలో డీలర్ల వద్ద బియ్యం తీసుకుని మూడు పుటల్లా కడుపు నిండా తినేవారమని పేర్కొంటున్నారు. అదే విధంగా గత మూడు నెలల నుంచి రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం ఇవ్వడంతో రేషన్ బియ్యానికి డిమాండ్ పెరిగింది. గతంలో దొడ్డు బియ్యం ఇవ్వడంతో తీసుకునేందుకు వెనకడుగు వేశారు.
ప్రస్తుతం సన్నబియ్యం పంపిణీ చేయడంతో తమ కుటుంబ సభ్యుల పేర్లు కార్డులో మ్యుటేషన్ చేయాలని అధికారులను కోరుతున్నారు. గత ఏడేళ్లు కితం జారీ కార్డులో మృతి చెందినవారి పేర్లతో పాటు, నగరాన్ని వీడిన గ్రామాల్లోకి వెళ్లిన వారి పేరు మీద రేషన్ బియ్యం తీసుకుంటున్నారు. వారి పేర్లు కూడా తొలగించకుండా అక్రమంగా బియ్యం తీసుకుంటున్న ఎందుకు పౌరసరఫరాల శాఖ ని ర్లక్షం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. నిజమైన లబ్ధ్దిదారులకు గుర్తించకుండా అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం లేదని నిలదీస్తున్నారు. చేర్పులు, అడ్రస్సు మార్పుల కోసం 2.10లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్లు, వా టిలో కుటుంబ సభ్యుల చేర్చుటకు సంబంధించినవే 1.50లక్షలు వరకు ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. గడిచిన మాసంలో ప్రభుత్వం కొత్తగా జిల్లాలో 56,060 కార్డులు మంజూరు చేయగా 2.25లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది.
ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలో కా ర్డులు 6.36 లక్షలకు చేరినట్లు వివరిస్తున్నారు. కొత్తకార్డులకు రెండు నుంచి యూనిట్‌కు 10కేజీల చొప్పన బియ్యం పంపిణీ చేస్తున్నట్లు డీలర్లు పేర్కొంటున్నారు. రేషన్‌కార్డుల్లో పేరు వారందరికి బియ్యం ఇస్తామని, కార్డులో పేరు లేకుంటే ఇవ్వమని, గతంలో తాము ఆన్‌లైన్ దరఖాస్తులు చేసినట్లు పత్రాలు తీసుకొచ్చి తమపై స్థానిక ప్రజలు ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు. అదే విధంగా కొంతమంది రాజకీయ దళారులు రేషన్‌కార్డుల పేరుతో బస్తీలకు చెందిన ప్రజలను కొత్త కార్డులు మంజూరు, మ్యుటేషన్ చెప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్నారని వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.