Saturday, November 23, 2024

భారతీయులందరిదీ ఒక్కటే డిఎన్‌ఏ: యోగి

- Advertisement -
- Advertisement -


గోరఖ్‌పూర్: ‘ఆర్యులు, ద్రవిడులు అన్న వివాదం నిరాధారమైనది, ఆర్యులేమీ బయట నుండి రాలేదు,దేశంలోని పౌరులందరిదీ ఒక్కటే డిఎన్‌ఏ అని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి శనివారం తెలిపారు.

ఆర్యులు బయటి నుంచి వచ్చిన ఆక్రమణదారులనేది ‘అంధకార దశ’కు చెందిన వాదన అన్నారు. “వామపక్ష చరిత్రకారులు రాసిన చరిత్రను మనం చదివేలా ఆంగ్లేయులు చేశారు. ఆర్యులు బయటి నుంచి ఏమీ రాలేదు. అది నిజం కూడా కాదు. రామాయణంలో మాత సీతాదేవి, శ్రీరామ ప్రభువును ‘ఆర్యపుత్ర’ అని సంబోధించారు. మన మత గ్రంథాలలో ఆర్యులు అంటే అధికులని, అనార్యులు అంటే సిద్ధాంతరహితులు, అనధికులు అనేందుకు మాత్రమే వాడారు”అని ఆయన తెలిపారు.

మహంత్ దిగ్విజయ్‌నాథ్ 52 వర్ధంతి, మహంత్ అవైద్యనాథ్ 7వ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన శ్రద్ధాంజలి కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, “మన దేశం ఒక్కటే, మనందరి డిఎన్‌ఏ ఒక్కటే అన్న కొత్త సిద్ధాంతాన్ని కనుగొన్నాము, ప్రధాని మోడీ ’ఒకే దేశం, శ్రేష్ఠమైన దేశం అని, సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ అనే మంత్రాన్నిచ్చారు. ప్రధాని నాయకత్వంలో 500 ఏళ్లకుపైగా ఉన్న అయోధ్య వివాదం కూడా పరిష్కారం అయింది” అని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News