Monday, November 25, 2024

భక్తులకు తాగునీరు అందించిన జలమండలి

- Advertisement -
- Advertisement -

Hyderabad water board that provided drinking water to Devotees

119 ప్రాంతాల్లో వాటర్ క్యాంపులు ఏర్పాటు

మన తెలంగాణ, హైదరాబాద్ : నగరంలో శోభాయమానంగా జరిగిన గణేష్ నిమజ్జనం ఏర్పాట్లలో జలమండలి కూడా భాగమైంది. హుస్సేన్‌సాగర్‌తో పాటు శోభయాత్ర సాగే అన్ని ప్రాంతాల్లో 119 వాటర్ క్యాంపులను ఏర్పాటు చేసింది. వాటర్ క్యాంపులో భక్తుల కోసం 30.72లక్షల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచింది. ఆదివారం తెల్లవారుజూము నుంచే భక్తులకు మంచినీటిని పంపిణీ చేసింది. నగర వ్యాప్తంగా శోభయాత్ర జరిగే ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రాలకు జలమండలి ఉచితంగా తాగునీటి ట్యాంకర్లను సరఫరా చేసింది. భక్తులకు అందించిన నీటి నాణ్యతను, క్లోరిన్ లెవల్స్‌ను క్వాలిటీ అస్యూరెన్స్ టీమ్‌లు ఎప్పటికప్పడు పరిశీలించాయి. మరోవైపు జలమండలి ఎండీ దానకిషోర్ ఆదేశాల మేరకు శోభయాత్ర జరిగే దారుల్లో జీఎంలు, సీజీఎంలు, జలమండలి సిబ్బంది క్షేత్రస్దాయిలో ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఎక్కడ వాటర్ లీకేజీలు, సివరేజ్ ఓవర్‌ప్లో లేకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News