- Advertisement -
న్యూఢిల్లీ : న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ ఒకటో ప్లాట్‌ఫారంలో ప్రయాణికుల కోసం ప్రపంచ స్థాయి అత్యంత ఆధునిక సదుపాయాలతో కూడిన హాలును రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) ఏర్పాటు చేసింది. రైలు ప్రయాణికులకు గొప్ప అనుభవాన్ని కలిగించాలన్న లక్షం తోనే దీన్ని ఏర్పాటు చేశారు. రైళ్ల రాకపోకల వేళల వివరాలు, వైఫై , టెలివిజన్, బెవరేజెస్, బఫెట్స్, తదితర అన్ని సౌకర్యాలు, సేవలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. లగేజి రాక్‌లు, విశ్రాంతి గదులు, షవర్ బాత్ రూమ్స్, డ్రెస్ ఛేంజి రూమ్స్ తదితర సౌకర్యాలు ఏర్పాటు అయ్యాయి. కంప్యూటర్, ప్రింటర్, ఫోటోస్టాట్, ఫాక్స్, వార్తాపత్రికలు, మేగజైన్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఆధునిక సౌకర్యాల ఈ లాంజ్ చిత్రాలను నయీభారత్ కా నయీ స్టేసన్ అన్న శీర్షికతో రైత్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పోస్ట్ చేశారు.
- Advertisement -