కొత్తగా 173 కేసులు… ఒకరి మృతి
హైదరాబాద్ : రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రోజువారీ కొవిడ్ కేసులు 200 దిగువకు తగ్గాయి. గడచిన 24 గంటల్లో 35,160 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా .. కొత్తగా 173 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,94,564కి చేరింది. ఈ మేరకు ఆదివారం వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 19,044 చేరింది. కరోనాబారి నుంచి 315 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,005 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 98.65 శాతం ఉవండగా, మరణాల రేటు 0.58 శాతంగా ఉంది.
8 జిల్లాలో జీరో కేసులు
రాష్ట్రంలో నమోదైన రోజువారీగా కొవిడ్ కేసులలో జిహెచ్‌ఎంసిలో అత్యధికంగా 64 కేసులు నమోదు కాగా, 8 జిల్లాల్లో జీరో కేసులు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమురంభీం అసిఫాబాద్, ములుగు, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నిర్మల్, వనపర్తి జిల్లాల్లో జీరో కేసులు రిపోర్ట్ అయ్యాయి.