Friday, November 15, 2024

స్పెయిన్ ద్వీపం లాపాల్మాలో బద్ధలైన అగ్ని పర్వతం, పెద్ద ఎత్తున లావా..

- Advertisement -
- Advertisement -

Large volcanic eruption on Spanish island of Lapalma

మ్యాడ్రిడ్: అట్లాంటిక్ సముద్రంలోని స్పెయిన్ ద్వీపం లాపాల్మాలో ఆదివారం ఓ అగ్నిపర్వతం బద్ధలైంది. దాంతో, పరిసర గ్రామాల్లోని 1000మందిని హుటాహుటిన అక్కడి నుంచి తరలిస్తున్నారు. నలుపు, తెలుపు పొగలతో పెద్ద ఎత్తున లావా వెదజల్లుతోందని అధికారులు తెలిపారు. అగ్ని పర్వతం పేలడానికి ముందు ఆ ప్రాంతంలో 3.8 తీవ్రతతో భూప్రకంపనాలు నమోదయ్యాయి. వారం రోజులుగా ప్రకంపనాలను గుర్తించిన శాస్త్రవేత్తలు అక్కడి ఐదు గ్రామాల ప్రజల్ని ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా ఇప్పటికే సూచించారు. ఇప్పుడు పేలింది కుంబ్రేవీజా అనే అగ్ని పర్వతం. 1949లో, 1971లో ఈ అగ్ని పర్వతం పేలిందని అధికారులు తెలిపారు. ఇప్పుడిది మూడో పేలుడని వారు పేర్కొన్నారు. క్యానరీ ఐల్యాండ్స్‌లోని 8 ద్వీపాల్లో లాపాల్మా ఒకటి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News