Saturday, November 23, 2024

అదరగొట్టిన సిఎస్ కె

- Advertisement -
- Advertisement -

CSK won by 20 runs against MI

గైక్వాడ్ విధ్వంసం n చాహర్ మ్యాజిక్ n తొలి మ్యాచ్‌లో ధోనీ సేన గెలుపు

దుబాయి: ఐపిఎల్ రెండో దశ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 20 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో కిందటి మ్యాచ్‌లో ముంబై చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఆరు వికె ట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఆశించిన స్థాయిలో ఆరంభం లభించలేదు.

ఓపెనర్లు క్వింటన్ డికాక్ (17), అన్మోల్‌ప్రీత్ (16)లను దీపక్ చాహర్ ప్రారంభంలోనే పెవిలియన్ దారి చూపించాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావిం చిన సూర్యకుమార్ యాదవ్ కూడా నిరాశ పరిచాడు. అతను మూడు పరుగులు మాత్రమే చేసి ఠాకూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇషాన్ కిషన్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. 11 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా సౌరభ్ తివారి ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన తివారి ఐదు ఫోర్లతో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మిగతావారు విఫలం కావడంతో ముంబైకి ఓటమి తప్పలేదు.

ఆదుకున్న గైక్వాడ్

అంతకుముందు తొలుత బ్యాటిం గ్ చేసిన చెన్నైకి కూడా ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ డుప్లెసిస్, వన్‌డౌన్‌లో వచ్చిన మోయిన్ అలీలు ఖాతా తెరవకుండానే ఔటయ్యారు. అంబటి రాయుడు కూడా పరుగులేమి చేయకుండానే రిటైర్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.

ఇక సురేశ్ రైనా (4), కెప్టెన్ ధోనీ (3) కూడా విఫలమయ్యారు. దీంతో చెన్నై 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యతను ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తనపై వేసుకున్నాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన గైక్వాడ్ 58 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో చెన్నై స్కోరు 156 పరుగులకు చేరింది.

ప్రేక్షకుల సందడి..

ఐపిఎల్ రెండో దశ మ్యాచ్‌లకు ఆదివారం తెరలేచింది. దుబాయి స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఇక యుఎఇలో జరుగుతున్న ఐపిఎల్ మ్యాచ్ లను చూసేందుకు అభిమానులకు అనుమతి ఇచ్చారు. దీంతో ఆరంభ మ్యాచ్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. దీంతో మ్యాచ్‌లో సందడి వాతావరణం నెలకొం ది. ఇంతకుముందు జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌ల ను ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించిన విషయం తెలిసిందే. అంతేగాక కిందటి ఏడాది యుఎఇలోనే జరిగిన ఐపిఎల్ సీజన్ 13 కూడా ఖాళీ స్టేడియాల్లోనే కొనసాగింది. అయితే ఐపిఎల్ రెండో దశ మ్యాచ్‌లకు మాత్రం ప్రేక్షకులకు అనుమతి ఇచ్చారు. ఇక దుబాయిలో ఉంటున్న భారత అభిమానులు మ్యాచ్‌లను చూసేందుకు తరలి వచ్చారు. చాలా రోజుల తర్వాత మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసే అవకాశం రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News