- Advertisement -
కర్నూలు: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టుకు 52,580 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో 72,024 క్యూసెక్కుల నీటిని దిగువకు విడదుల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.60 అడుగులకు చేరింది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 170.6640 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు జలకళను సంతరించుకోవడంతో పర్యాటలకు తాకిడి పెరిగింది.
Heavy water flow into Srisailam Project
- Advertisement -