- Advertisement -
మాస్కో : సెంట్రల్ రష్యాలోని పెర్మ్ స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్లో సొమవారం ఓ విద్యార్థి జరిపిన కాల్లుల్లో కనీసం ఎనిమిది మంది చనిపోయి ఉంటారని నేర పరిశోధకులు తెలిపారు. రష్యాలో ఈ విద్యా సంవత్సరంలో విద్యాసంస్థ క్యాంపస్లో మూక కాల్పులు జరగడం ఇది రెండవసారి. ఇదివరలో 2021 మేలో ఇలాగే ఓ 19ఏళ్ల యువకుడు కజన్ సిటీలో కాల్పులు జరిపి తొమ్మిది మందిని పొట్టనపెట్టుకున్నాడు.
అనుమానితుడిని పట్టుకునేప్పుడు అతడికి గాయాలయ్యాయని రష్యాకు చెందిన ఇన్వెష్టిగేటివ్ కమిటీ తెలిపింది. దర్యాప్తుదారులు మొదట ఐదు మంది చనిపోయారని, ఆరుగురు గాయపడ్డారని తెలిపారు. కాల్పులు జరుపుతున్న అగాంతకుడి నుంచి తప్పించుకోడానికి క్యాంపస్ బిల్డింగ్ కిటికీల నుంచి తమ వస్తువులను విద్యార్థులు బయటికి విసిరేసి పరుగులు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
- Advertisement -