Saturday, November 23, 2024

దేశానికే తెలంగాణ విద్య మార్గదర్శనం కావాలి: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

దేశానికే తెలంగాణా విద్య మార్గదర్శనం కావాలి

ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో విద్యారంగం బలోపేతం

గురుకులాలకు పెరిగిన డిమాండ్ అందుకు నిదర్శనం

అందులో ఉపాధ్యాయుల పాత్రే కీలకం

పి ఆర్ టి యు నూతన కమిటీ మరింత చొరవ చూపాలి

మంత్రి జగదీష్ రెడ్డి ని కలిసిన పి ఆర్ టి యు నల్లగొండ జిల్లా నూతన కమిటీ

అభినందించిన మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్న మాజీ యం ఎల్ సి పూల రవీందర్ తదితరులు

India needs Telangana education guidance

హైదరాబాద్: తెలంగాణ విద్య యావత్ భారతదేశానికి మార్గదర్శనం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆకాంక్షించారు. అందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు మరింత శ్రమించాలని ఆయన కోరారు. కరోనా తో విద్యారంగం ఒకింత ఇబ్బంది పడిందని, నల్లగొండ జిల్లా పంచాయత్ రాజ్ ఉపాధ్యాయ సంఘానికి ఎన్నికయిన నూతన కమిటీ మంగళవారం ఉదయం హైదరాబాద్ లో మంత్రి జగదీష్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీని అభినందించిన మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ… కరోనా వంటి పరిస్థితులను అధిగమించి విద్యార్థులకు విద్యానందిస్తున్న ఉపాద్యాయులను ఆయన అభినందించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలో తెలంగాణా రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం అవుతుందన్నారు. గురుకులాల ద్వారా అందిస్తున్న విద్య అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న విషయాన్ని గుర్తించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా నూతన పి ఆర్ టి యు కమిటీని ఆయన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ యం ఎల్ సి పూల రవీందర్, కమిటీ నూతన అధ్యక్షుడు సుంకరి బిక్షం గౌడ్, ప్రధాన కార్యదర్శి కాళం నారాయణ రెడ్డి లతో పాటు మాజీ ప్రధాన కార్యదర్శులు ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి ,కోమటిరెడ్డి నరసింహా రెడ్డి, భసిరెడ్డి రవీందర్ రెడ్డి, ఫణికుమార్, మేకల జానారెడ్డి , జే వి గౌడ్, యూసుఫ్, రమణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News