Saturday, November 23, 2024

1918 నాటి ఫ్లూ మాదిరిగానే లక్షల అమెరికన్లను బలిగొన్న కరోనా

- Advertisement -
- Advertisement -

Corona that killed millions of Americans similar to 1918 flu

 

వాషింగ్టన్ : 1918 19 మధ్యకాలంలో ఆనాడు స్పానిష్ ఫ్లూ అమెరికాలో ఎన్ని లక్షల మందిని పొట్టన పెట్టుకుందో అదే విధంగా కరోనా మహమ్మారి ఇప్పుడు అన్ని లక్షల మందిని బలిగొంది. ఆనాడు స్పానిష్ ప్లూ వల్ల దాదాపు 6,75,000 మంది ప్రాణాలు కోల్పోయారు. వందేళ్ల క్రితం అమెరికా జనాభా ఇప్పటి జనాభాలో మూడో వంతు ఉండేది. అంటే దీని అర్థం ఫ్లూ ఎంతమందిని ఆనాడు బలిగొందో చెప్పవచ్చు. ఏ విధంగా ఆలోచించిన కరోనా మహమ్మారి సంక్షోభం పెను విషాదమే. శాస్ట్రీయ పరిజ్ఞానంలో అద్భుతమైన పురోగతి సాధించినప్పటికీ వ్యాక్సిన్ల అందుబాటులో ఘోర వైఫల్యం ఇప్పుడు కనిపిస్తోంది. అమెరికా సమాజంలో ప్రముఖులు , నేతలు ఈ పరిస్థితిని పట్టించుకోలేదని మిచిగన్ యూనివర్శిటీకి చెందిన వైద్య చారిత్రక పరిశీలకుడు డాక్టర్ హోవర్డ్ మార్కెల్ వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ప్రతివారూ వ్యాక్సిన్ పొందడమే సరైన మార్గమని సూచించారు. స్పానిష్ ఫ్లూ మాదిరిగా మన నుంచి కరోనా పూర్తిగా మాయం కాదని, వ్యాక్సినేషన్ ద్వారా తరచుగా ఇన్‌ఫెక్షన్ పొందడం ద్వారా ఇది సీజనల్ వైరస్‌గా తేలికపాటి లక్షణాలతో మార వచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారని పేర్కొన్నారు.

ఇది జలుబు మాదిరిగా మారుతుందని మనం ఆశిద్దామని, అయిన గ్యారంటీగా చెప్పలేమని ఎమోరీ యూనివర్శిటీ బయోలజిస్టు రుస్తుం ఆంటియా అభిప్రాయ పడ్డారు. కొన్నేళ్ల తరువాత ఈ పరిస్థితి ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వెలిబుచ్చారు. ఇప్పటికి మాత్రం ఈ మహమ్మారి అమెరికాతోపాటు ఇతర దేశాల్లోను కోరలు చాస్తోందని పేర్కొన్నారు. డెల్టా వేరియంట్ వల్ల కొత్తగా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. అమెరికాలో ఇంకా రోజుకు సరాసరిన 1900 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. జాన్స్ హోప్‌కిన్స్ యూనివర్శిటీ సోమవారం వరకు సేకరించిన డేటా ప్రకారం మొత్తం మృతుల సంఖ్య 6,74,000 వరకు ఉంది. ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని అభిప్రాయ పడింది. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ రూపొందించిన నమూనాల ప్రకారం వచ్చే జనవరి 1 నాటికి అదనంగా మరో లక్ష మంది కరోనాకు బలయ్యే ప్రమాదం ఉందని తేలింది. అప్పటికి మొత్తం మీద మృతుల సంఖ్య 7,76,000 కు చేరవచ్చు. 1918 19 లో ఇన్‌ఫ్లూయెంజా మహమ్మారి ప్రపంచం మొత్తం మీద 50 మిలియన్ల మందిని బలిగొంది. అప్పుడు ప్రపంచ జనాభా ఇప్పటి జనాభాలో నాలుగో వంతు ఉండేది. ఇప్పుడు కరోనా వల్ల ప్రపంచం మొత్తం మీద 4.6 మిలియన్ కన్నా ఎక్కువ మందే ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News