Friday, November 22, 2024

13 హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లు

- Advertisement -
- Advertisement -

New Chief Justices to 13 High Courts

8 మందికి సిజెలుగా పదోన్నతులు
అయిదుగురు ప్రధాన న్యాయమూర్తుల బదిలీ
కేంద్రానికి సిఫార్సు చేసిన సుప్రీం కొలీజియం

న్యూఢిల్లీ: దేశంలోని 13 హైకోర్టులకు త్వరలో కొత్త చీఫ్ జస్టిస్‌లు రారున్నారు. కోల్‌కతా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్ బిందాల్ సహా 8 మందికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించడంతో పాటుగా మరో ఐదు హైకోర్టుల సిట్టింగ్ చీఫ్ జస్టిస్‌లను వేరే హైకోర్టులకు బదిలీ చేయాలని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఇంతకు ముందే మీడియాలో వచ్చిన కొలీజియం నిర్ణయాలను మంగళవారం సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. బిందాల్‌ను అలహాబాద్ హైకోర్టు సిజెగా నియమించాలని సిఫార్సు చేశారు. కొలీజియంలో జస్టిస్ ఎన్‌వి రమణ కాక న్యాయమూర్తులు యుయు లలిత్, ఎఎం ఖన్విలర్‌లు కూడా సభ్యులుగా ఉన్నారు. ‘సెప్టెంబర్ 16న జరిగిన సమావేశంలో సుప్రీంకోర్టు దిగువ సేర్కొన్న విధంగా హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సిఫార్సు చేసింది’ అని సుప్రీంకోర్టు ప్రకటన పేర్కొంది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా కొలీజియం సిఫార్సు చేసిన వారిలో జస్టిస్ బిందాల్ కాకుండా జస్టిస్ వి మోరె( మేఘాలయ), సతీశ్ చంద్ర శర్మ( తెలంగాణ), ప్రకాశ్ శ్రీవాస్తవ( కోల్‌కతా), ఆర్‌వి మాలిమఠ్( మధ్యప్రదేశ్), రితురాజ్ అవస్థి(కర్నాటక), అరవింద్ కుమార్( గుజరాత్), ప్రశాంత్ కుమార్ మిశ్రా( ఎపి) ఉన్నారు. మరో ప్రకటనలో ఇతర హైకోర్టులకు బదిలీ చేసిన ఐదురుగు చీఫ్ జస్టిస్‌ల పేర్లను పేర్కొంది. త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎకె ఖురేషిని రాజస్థాన్ హైకోర్టు సిజెగా నియమించాలని, అలాగే రాజస్థాన్ హైకోర్టు సిజెగా ఉన్న జస్టిస్ ఇందర్‌జిత్ మహంతిని త్రిపుర హైకోర్టు సిజెగా బదిలీ చేయాలని సిఫార్సు చేసింది. అలాగే మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ ఖురేషిని హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టుకు, మేఘాలయ హైకోర్టు సిజె బిశ్వజిత్ సొమద్దర్‌ను సిక్కిం హైకోర్టుకు, ఎపి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎకె గోస్వామిని చత్తీస్‌గఢ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసింది.

ప్రస్తుతం కోల్‌కతా హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ బిందాల్ పశ్చిమ బెంగాల్‌లో బిజెపి, తృణమూల్ కాంగ్రెస్ మధ్య నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు సంబంధించి తీసుకున్న న్యాయపరమైన నిర్ణయాలు, పాలనాపరమైన నిర్ణయాల కారణంగా ఇటీవల వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు. దేశంలోనే సీనియర్‌మోస్ట్ జడ్జిల్లో ఒకరైన జస్టిస్ ఖురేషిని వాప్తవానికి గుజరాత్ హైకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పించినప్పటికీ సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పించకపోవడం కారణంగా వార్తల్లో కెక్కారు. వీరే కాకుండా మరో 17 మంది న్యాయమూర్తులను న్యాయమూర్తులు జశ్వంత్ సిన్హా, సబీనా, టిఎస్ శివలింగం, సంజయకుమార్ మిశ్రా, ఎంఎం శ్రీవాస్తవ, సౌమెన్ సేన్, అహసనుద్దీన్ అమానుల్లా, ఉజ్జల్ భుయాన్, పరేష్ ఆర్ ఉపాధ్యాయ్, ఎంఎస్‌ఎస్ రామచంద్ర రావు, అరిందమ్ సిన్హా, ఎఎం బదర్, యశ్వంత్ వర్మ, వివేక్ అగర్వాల్, చంద్రధరి సింగ్, అనూప్ చిట్కార, రవినాథ్ తిహారీలను బదిలీ చేయాలని కూడా కొలీజియం సిఫార్సు చేసింది. దేశంలో హైకోర్టులు, సుప్రీంకోర్టులో పెద్ద సంఖ్యలు ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం చర్యలు తీసుకొంటున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జస్టిస్ ఎన్‌వి రమణ సుప్రీంకోర్టుకు ఒకే సారి 9 ఖాళీలను భర్తీ చేయడంతో పాటు దేశంలోని వివిధ హైకోర్టుల్లో జడ్జీలుగా నియమించడానికి దాదాపు 100 మంది పేర్లను సిఫార్సు చేయడం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News