- Advertisement -
పోర్ట్బ్లెయిర్: అండమాన్, నికోబార్ దీవుల్లో మంగళవారం రాత్రి భూకంపం సంభవించింది. రాత్రి 11.45 గంటలకు ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైంది. పోర్ట్బ్లెయిర్ పట్టణానికి 202 కిలోమీటర్ల దూరంలో భూమికి 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.
Earthquake hits Andaman and Nicobar Islands
- Advertisement -